
మాటలు కోటలు దాటుతున్నాయి
మెదక్‌జోన్: సీఎం రేవంత్‌రెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయి.. ప్రజలకు ఇచ్చిన హామీలు మాత్రం నెరవేరటం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం మెదక్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలను కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా విస్మరించిందన్నారు. ఈనెల 27న జరిగే టీచర్స్, గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను బలపర్చాలని కోరారు. ఎన్నికల తర్వాత ప్రజా సమస్యలపై ఉద్యమబాటలో పయనిస్తామన్నారు. రాష్ట్రంలో సీఎంలు మారినా, పాలన ఏ మాత్రం మారలేదన్నారు. కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుందన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్న అనేక రాష్ట్రాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయని అన్నారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చాయని మండిపడ్డారు. ఉద్యోగులకు జీతాలు, రిటర్మెంట్ బెన్‌ఫిట్స్ ఇవ్వటం లేదన్నారు. ఎంపీ రఘునందన్‌రావు మాట్లాడుతూ.. సమాజానికి సేవ చేయాలనే దృక్పథంతో అంజిరెడ్డి, కొమురయ్యలు శాసన మండలిలో పోటీపడుతున్నారన్నారు. మా అభ్యర్థుల గెలుపు ఎప్పుడో ఖరారైందని ధీమా వ్యక్తం చేశారు. అంతకుముందు విద్యావేత్తలు, కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్‌గౌడ్, గోదావరి అంజిరెడ్డి, వీణ, తదితరులు పాల్గొన్నారు.
పనులు మాత్రం జరగటం లేదు
ీసీఎం రేవంత్‌రెడ్డిపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఫైర్
Comments
Please login to add a commentAdd a comment