వరి కోతల సమయంలో అప్రమత్తంగా ఉండాలి
కౌడిపల్లి(నర్సాపూర్): వరికోతల సమయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి సురేష్ అన్నారు. బుధవారం మండలంలోని కౌడిపల్లి, మహమ్మద్‌నగర్, తునికి రైతువేదికల్లో రైతులకు వరికోతలు, జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరి గింజలు పూర్తిగా గట్టిపడిన తర్వాతే కోత కోయాలన్నారు. వరికోత యంత్రాలను జా గ్రత్తగా నడిపేలా చూడాలన్నారు. ధాన్యంలో తాలు, మట్టి పెడ్డలు, ఇతర వ్యర్థాలు లేకుండా కొనుగోలు కేంద్రాలకు తరలించాలని సూచించారు. కార్యక్రమంలో ఏడీఏ పుణ్యవతి, ఏఓ స్వప్న, ఏఈఓలు సాహితి, సృజన, సౌజన్య రైతులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment