పాపన్నపేట(మెదక్): జాతీయస్థాయి జూనియర్స్ బాలుర కబడ్డీ పోటీలకు జిల్లా నుంచి నరేంద్రనాథ్ ఎన్నికై నట్లు జిల్లా కబడ్డీ అ సోసియేషన్ ప్రెసిడెంట్ మధుసూదన్‌రెడ్డి, సెక్రటరీ రమేష్ శనివారం తెలిపారు. ఈనెల 27వ తేదీ నుంచి 30 వరకు బీహార్‌లో పోటీలు జరుగుతాయని చెప్పారు. వికారాబాద్‌లో జరిగిన పోటీల్లో నరేంద్రనాథ్ ప్రతిభ చూపినట్లు తెలిపారు. ఈసందర్భంగా కబడ్డీ అసోసియేషన్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.
ఎస్సీ, ఎస్టీ కేసుపై విచారణ
వెల్దుర్తి(తూప్రాన్): ఎస్సీ, ఎస్టీ కేసును విచారించేందుకు తూప్రాన్ డీఎస్పీ వెంకటరెడ్డి శనివారం మండలంలోని మెల్లూర్ గ్రామాన్ని సందర్శించారు. గ్రామానికి చెందిన ఇద్దరు ఈనెల 20వ తేదీన కులం పేరుతో దూషించి దాడికి పాల్పడ్డారని శుక్రవారం వెల్దుర్తి పోలీస్‌స్టేషన్‌లో దాసరి బాబు ఫిర్యాదు చేశాడు. దీంతో శనివారం డీఎస్పీ వెంకటరెడ్డి సంఘటనా స్థలాన్ని సందర్శించారు. దాడి జరిగిన గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదురుగా ఉన్న గుడిసె వద్ద బాధితులు, సాక్షులను విచారించారు. విచారణ ప్రక్రియ మొత్తాన్ని వీడియో రికార్డ్ చేశారు. డీఎస్పీ వెంట వెల్దుర్తి ఎస్సై రాజు ఉన్నారు.
20 మంది గైర్హాజరు
మెదక్ కలెక్టరేట్: పదో తరగతి పరీక్షలు రెండోరోజు శనివారం ప్రశాంతంగా జరిగాయి. జిల్లాలో మొత్తం 10,384 మంది విద్యార్థులకు గానూ 10,364 మంది హాజరుకాగా, మరో 20 మంది గైర్హాజరయ్యారు. జిల్లా కేంద్రంలోని పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ రాహుల్‌రాజ్ పరిశీలించారు. డీఈఓ రాధాకిషన్, ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు పలు పరీక్ష కేంద్రాలను సందర్శించారు. తాగునీరు అందుబాటులో ఉంచాలని, ఎక్కడ మాస్ కాపీయింగ్‌కు ఆస్కారం లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సిబ్బందిని ఆదేశించారు.
అక్రమ అరెస్టులు సరికాదు: సీఐటీయూ
మెదక్ కలెక్టరేట్/నర్సాపూర్: అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని సీఐటీయూ జిల్లా కోశాధికారి కడారి నర్సమ్మ అన్నారు. శనివారం మెదక్ పట్టణంలోని పోస్టాఫీస్ చౌరస్తా వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అసంఘటిత రంగ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం చలో హైదరాబాద్ పిలుపునిచ్చామని తెలిపారు. జిల్లా నుంచి కార్యక్రమానికి వెళ్తున్న సీఐటీయూ నాయకులను ముందస్తుగానే ఎక్కడికక్కడ అరెస్టు చేయడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయకుండా విస్మరిస్తుందన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ సంతోష్, అజయ్, నర్సింలు, సాయిలు, గట్టయ్య, రాజు, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. అలాగే నర్సాపూర్‌లో ప్రభుత్వం దిష్టిబొమ్మను దహనం చేశారు. అక్రమ అరెస్టులు సరికాదని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు నాగరాజు అన్నారు. అసంఘటిత కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక
జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక