
స్వయం ఉపాధికి ‘యువవికాసం’
కలెక్టర్ రాహుల్‌రాజ్
హవేళిఘణాపూర్(మెదక్)/మెదక్‌జోన్: స్వయం ఉపాధి కల్పించేందుకు చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని మీసేవ కేంద్రాన్ని పరిశీలించి ఆన్‌లైన్ పోర్టల్ గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇప్పటివరకు హవేళిఘణాపూర్ మండలంలో 68 దరఖాస్తు స్వీకరించినట్లు చెప్పారు. ఈ పథకంలో 75 రకాల యూనిట్ల ఎంపికకు అవకాశం ఉందన్నారు. జిల్లాస్థాయిలో నోడల్ అధికారిగా డీఆర్‌డీఓ ఉంటారని తెలిపారు. అర్హులు సంబంధిత వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసి ప్రింట్‌ను ఎంపీడీఓ, మున్సిపల్ పరిధిలో మున్సిపల్ కమిషనర్‌కు అందజేయాలని సూచించారు. జిల్లాలో బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనారిటీ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం ఇదే పథకానికి సంబంధించి సీఎస్ శాంతికుమారి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. వీలైనంత ఎక్కువ మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకునే విధంగా చర్యలు చేపడతామనివివరించారు.