
హాలీవుడ్ సినిమా ‘ఫారెస్ట్‌గంప్’ ఆధారంగా ఆమిర్ ఖాన్ హీరోగా హిందీలో రీమేక్ అవుతోన్న చిత్రం ‘లాల్‌సింగ్ చద్దా’. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతోంది. ఈ సినిమాలోని కీలక సన్నివేశాల్లో ఒకటైన పరిగెత్తే సీన్‌లో నటిస్తున్నప్పుడు ఆమిర్ ఖాన్ కొంచెం ఇబ్బందిపడ్డారట. ఇప్పుడు ఈ షూటింగ్‌లో ఆమిర్ పక్కటెములకు గాయమయిందని సమాచారం.
అయినా కూడా సినిమా షెడ్యూల్‌కి ఇబ్బంది కలగకుండా పెయిన్ కిల్లర్స్ వేసుకుని నటిస్తున్నారట. లాక్‌డౌన్ బ్రేక్ తర్వాత ఇటీవలే ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టారు. ఎంతో పకడ్బందీగా ప్లాన్ చేశారు. ఇప్పుడు విశ్రాంతి అంటే మొత్తం షెడ్యూల్ అప్‌సెట్ అవుతుందని, నొప్పిని భరిస్తూ షూటింగ్ కొనసాగించాలని ఆమిర్ అనుకున్నారట. యూనిట్ అంతా ‘దటీజ్ ఆమిర్’ అని ఆయన్ను కొనియాడుతున్నారు. అద్వైత్ చందన్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్‌తో కలిసి ఆమిర్ ఖాన్ నిర్మిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment