
‘ఓణి వేసిన దిపావళి వచ్చిందా ఇంటికి’ అంటూ ‘పందెంకోడి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది మీరా జాస్మిన్. మొదట ‘సూత్రదారన్’(2001) అనే మలయాళ సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన ఆమె ‘అమ్మాయి బాగుంది’ చిత్రంతో నేరుగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.
ఇక వరస హిట్లు అందుకుని స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన మీరా జాస్మిన్ కొంతకాలంగా తెరపై కనుమరుగైంది. ఈ నేపథ్యంలో నేడు ఆమె బర్త్‌డే సందర్భంగా మారోసారి తెరపైకి వచ్చింది. మంగళవారం (ఫిబ్రవరి 15) ఆమె పుట్టిన రోజు సందర్భంగా తన లెటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది.
ఈ సందర్భంగా మీరా జాస్మిన్ సినీ ప్రయాణం, ఆమె సినిమాలను మరోసారి గుర్తు చేసుకుందాం. అమ్మాయి బాగుంది చిత్రంలో తెలుగు టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మీరా జాస్మిన్.. ఆ తర్వాత పవన్ కల్యాణ్ సరసన గుడుంబా శంకర్ నటిచింది.
ఆ వెంటనే రవితేజతో భద్రలో జోడి కట్టిన మీరా తొలి కమర్షియల్ హిట్ అందుకుంది. పరిశ్రమలో అడుగు పెట్టిన ఆనతి కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా మారింది. ఇక తర్వాత ఆమెను వరస ప్లాప్ వెంటాడిన చివరి గొరింటాకులో రాజశేఖర్‌కు చెల్లిగా నటించి హిట్ అందుకుంది.
ఆ తర్వాత తెలుగులో ఆమెకు అవకాశాలు కరువయ్యాయి. దీంతో తమిళ, మళయాళంలో ఆడపాదడపా సినిమాలు చేస్తున్న క్రమంలో దుబాయ్‌కి చెందిన ఇంజనీర్ అనిల్ జాన్ టిటస్‌ని పెళ్లి చేసుకుని అక్కడే సెటిల్ అయింది.
ఈ క్రమంలో చాలా కాలం తర్వాత ఆమె లీడ్ రోల్‌లో మలయాళంలో 'మకల్' అనే చిత్రంలో రీఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇటీవల ఇచ్చిన ఓ ఫొటోషూట్ ఫొటోలను షేర్ చేసి ఫుల్ గ్లామర్ షో చేసి ఫ్యాన్స్‌కు షాకిచ్చింది మీరా జాస్మిన్.
Comments
Please login to add a commentAdd a comment