
అనేక సినిమాల్లో సహాయక పాత్రలతో పాటు నెగెటివ్ షేడ్స్ ఉన్న రోల్స్ చేసి ప్రేక్షకుల మెప్పు పొందింది ఉమాదేవి. కెరీర్‌లో బాగానే రాణిస్తున్న ఈ నటి జీవితంలో మాత్రం ఎన్నో ఒడిదుడుకులకు లోనైంది. 18 ఏళ్లకే ప్రేమపెళ్లి చేసుకున్న ఈ నటి భర్తతో ఏడేళ్లు విడిపోయింది. కానీ పిల్లల కోసం ఆ తర్వాత మళ్లీ కలిసినా పెద్దగా ప్రయోజనం లేదంది. అయితే తన బాధలు వ్యక్తపరిస్తే పిల్లలు కూడా డల్ అయిపోతారని సెట్స్‌లో సరదాగా ఉండేదాన్ననంటోంది.
పిల్లల కోసమే బతుకుతున్నానన్న ఉమా తానెవరికీ భయపడనని, ఉన్నదున్నట్లుగా మాట్లాడతానని అంటోంది. ఇక సినిమాలతో పాటు సీరియళ్లలోనూ నటించిన ఆమె హౌస్‌లోకి పదిహేనో కంటెస్టెంట్‌గా గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది. మరి హౌస్‌లో ఇతర కంటెస్టెంట్లకు ఆమె గట్టి పోటీనిస్తుందా? అన్నది వెరీ ఇంట్రస్టింగ్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment