
Shanmukh Jaswanth: బిగ్‌బాస్ షో అంటే నవరసాల కలయిక. కోపతాపాలు, కొట్లాటలు, చిరునవ్వులు, సుఖసంతోషాలు, కన్నీటి బాధలు, గెలుపోటముల కలయికలు, బంధాలు, వైరాలు, అలకలు, ఆటుపోట్లు.. ఇలా అన్నీ ఉంటాయి. ఇక ప్రతి సీజన్‌లో ముక్కు మీద కోపం ఉండే కంటెస్టెంట్లను మనం చూస్తూనే ఉన్నాం. మొదటి సీజన్‌లో శివబాలాజీ, రెండో సీజన్‌లో తనీష్ అల్లాడి, మూడో సీజన్‌లో అలీ రెజా, నాలుగో సీజన్‌లో సయ్యద్ సోహైల్ అతిగా ఆవేశపడేవారు. ఇక ఈ సీజన్‌లో ఆవేశం స్టార్లు ఎక్కువే ఉన్నట్లు కనిపిస్తోంది.
అయితే అయినదానికి కానిదానికి కూడా ఆవేశపడుతోంది మాత్రం నటి ఉమాదేవి అంటున్నారు నెటిజన్లు. తనకు ఆలూ కూర రాలేదని యానీ మాస్టర్ మీద శివాలెత్తిందావిడ. ఆ తర్వాత వెజ్, నాన్‌వెజ్ ఎవరు వండుతారని చర్చ నడుస్తుండగా లహరి.. వెజ్‌కైతే ప్రియాంక సింగ్ ఉందని చెప్పింది. అంటే నేను వెజ్‌కు పనికి రాను అంటున్నారు కదా! అని అనవసరమైన వాదనతో లేనిపోని గొడవ సృష్టించింది. మీరు వెజ్ చేయడానికి పనికి రారు అని ఎవరూ అనలేదని కెప్టెన్ సిరి గట్టిగా సమాధానమివ్వడంతో ముఖం మాడ్చుకుని సైలెంట్ అయిపోయింది. ఆమె వైఖరి చూసిన ఇతర కంటెస్టెంట్లు తనతో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అనుకుంటున్నారు.
తాజాగా ఆమె గురించి సిరి, కాజల్ దగ్గర ఓపెన్ అయ్యాడు షణ్ముఖ్ జశ్వంత్. ఆమె తనతో మాట్లాడటం లేదని, చాలా కోపంగా ఉంటున్నారని పేర్కొన్నాడు. నిజానికి ఆమెను మొన్న నామినేట్ చేయాలనుకున్నా.. కానీ తల్లి పేరు(ఉమ) కూడా అదే కావడంతో వదిలేశానని చెప్పుకొచ్చాడు. అసలు ఉమాదేవి షణ్నూమీద ఎందుకు కోపంగా ఉంది? వీరిద్దరి మధ్య దూరం చెదిరి కలిసిపోతారా? లేదా వచ్చేవారం ఉమాదేవిని షణ్నూ నామినేట్ చేస్తాడా? అనేది తప్పక చూడాల్సిందే!
Comments
Please login to add a commentAdd a comment