Deepika Padukone Shocking Comments On Ananya Panday In a Interview Viral - Sakshi
Sakshi News home page

Deepika Padukone-Ananya Panday: కో-స్టార్‌ అనన్య పాండేపై దీపికా షాకింగ్‌ కామెంట్స్‌

Published Thu, Feb 3 2022 8:27 PM | Last Updated on Fri, Feb 4 2022 9:24 AM

Deepika Padukone Shocking Comments On Ananya Panday In a Interview - Sakshi

Deepika Padukone Shocking Comments On Ananya Panday: లైగర్‌ బ్యూటీ, బాలీవుడ్‌ హీరోయిన్‌ అనన్య పాండే స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకొనె ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. వీరిద్దరూ కలిసి నటించిన తాజా చిత్రం గెహ్రాయా. ఈ మూవీ ఫిబ్రవరి 11న ఓటీటీలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లతో చిత్రం బృందంగా బిజీగా ఉంది. ఈ క్రమంలో ఇటీవల ఓ నేషనల్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కో-స్టార్‌ అయిన అనన్యపై దీపికా చేసిన కామెంట్స్‌ హాట్‌టాపిక్‌గా మారాయి.

చదవండి: ‘పుష్ప’ మూవీపై విరుచుకుపడ్డ గరికపాటి.. కడిగిపారేస్తా..

ఇంటర్య్వూలో అనన్య గురించి దీపికా మాట్లాడుతూ.. ‘గెహ్రాన్‌ మూవీ చేసే ముందు వరకు నాకు అనన్య పాండే అంటే ఎవరో తెలియదు. తనని ఎప్పుడు కలవలేదు కూడా. ఇదేదో జోక్‌ చేయడానికి చెప్పడం లేదు. వాస్తవంగానే మూవీ మొదలయ్యే ముందు వరకు అనన్య ఎవరనేది అసలు తెలియదు. అందరి లాగే నేను కూడా తన పేరును సోషల్‌ మీడియాలో విన్నాను’ షాకింగ్‌ కామెంట్స్‌ చేసింది. అలాగే ‘నా వయసు 36, అనన్య వయసు 23. నా చెల్లి కన్నా చిన్నది. తనతో కలిసి నటించడం నిజంగా చక్కటి అనభూతిని ఇచ్చింది. అనన్య అందరి నటుల్లా కాదు.

చదవండి: వరుణ్‌ తేజ్‌తో పెళ్లిపై తొలిసారి స్పందించిన లావణ్య, ఏం చెప్పిందంటే..

ఆమె చాలా తెలివైన అమ్మాయి. సెట్‌లో ఇతర నటులు ఎలా నటిస్తున్నారనేది క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. వాళ్ల నుంచి నేర్చుకుంటుంది. భవిష్యత్తులో తను మరిన్నీ ప్రాజెక్ట్స్‌ చేయాలని ఆశిస్తున్నా’ అంటూ దీపికా చెప్పుకొచ్చింది. అయితే అనన్య ఎవరో తెలియదంటూ దీపికా కామెంట్స్‌ చేయడంతో అందరూ షాక్‌ అవుతున్నారు. తను బాలీవుడ్‌ నటి అయినప్పటికీ అనన్య ఎవరో తెలియకపోవడం ఆశ్చర్యకరమంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. కాగా గెహ్రాన్‌ దీపికా లీడ్‌ రోల్‌ పోషిస్తుండగా.. అనన్య పాండే, గల్లిబాయ్‌ ఫేం సిద్ధార్థ్‌ చతర్వేది ప్రధాన పాత్రలు పోషించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement