సంగీత జ్ఞాని ఇళయరాజా జీవితం వెండితెరపైకి రానుంది. ఈ సినిమాకు సంబంధించి డైరెక్టర్ విషయంలో మార్పులు జరిగినట్లు రూమర్స్ వస్తున్నాయి. ధనుష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని మెర్క్యూరీ గ్రూప్, కనెక్ట్ మీడియా సంస్థలు నిర్మించనున్నాయి. మార్చి 20న ఈ సినిమాను లాంచ్ చేసి 2025 మార్చిలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను బాలీవుడ్ దర్శకుడు ఆర్.బాల్కి తెరకెక్కించనున్నారని ప్రచారం జరిగింది.
ఇదే విషయం గురించి ఒక ఇంటర్వ్యూలో ఈ ప్రాజెక్ట్ గురించి దర్శకుడు ఆర్.బాల్కి ఇలా అన్నాడు. 'నాకు ఇళయరాజా గారి జీవితంపై సినిమా తీయాలని ఉంది. అది కూడా ధనుష్ హీరోగా. వారిద్దరి పోలికలు కొంచెం దగ్గరగా అనిపిస్తాయి. ధనుష్ కూడా ఆయనకి పెద్ద అభిమాని కాబట్టి ఈ ప్రాజెక్టు కోసం ధనుష్ ఒప్పుకుంటారు' అని తెలిపారు. బాలీవుడ్‌లో ధునుష్, అమితాబ్ బచ్చన్ నటించిన 'షమితాబ్' చిత్రానికి డైరెక్టర్ ఆర్. బాల్కి అనే విషయం తెలిసిందే.
(ధనుష్, ఆరుణ్ మాథేశ్వరన్- ఆర్ బాల్కి, ధునుష్)
అయితే తాజా సమాచారం ప్రకారం ఇళయరాజా బయోపిక్ కోసం బాల్కిని కాదని డైరక్టర్ అరుణ్ మాథేశ్వరన్‌ను ఎంపిక చేసినట్లు కోలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి. ధనుష్ నటించిన కెప్టెన్ మిల్లర్ సినిమాకు ఆరుణ్ మాథేశ్వరన్ డైరెక్టర్ అనే విషయం తెలిసిందే. కానీ ఈ విషయం గురించి ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. సుమారు7 వేలకు పైగా పాటలకు సంగీతం అందించిన ఇళయరాజా బయోపిక్ చిత్రానికి 'ఇసైజ్ఞాని' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment