కిరణ్ తిరుమలశెట్టి దర్శకత్వంలో ధర్మ హీరోగా నటించిన చిత్రం డ్రింకర్ సాయి. బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అనేది ఈ చిత్ర ట్యాగ్ లైన్. డిసెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చింది. సినిమా టాక్ విషయాన్ని పక్కన పెడితే హీరో ధర్మపై అయితే అందరు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ధర్మకి ఇది రెండో సినిమా. అంతకు ముందు సింధూరం అనే సినిమాలో నటించాడు. అయితే ఆ చిత్రం ఫ్లాప్ కావడంతో సరైన గుర్తింపు రాలేదు. కానీ డ్రింకర్ సాయిలో మాత్రం రెచ్చిపోయి నటించాడు. రెండో సినిమానే అయినప్పటికీ.. కెమెరా ముందు ఎలాంటి ఇబ్బంది పడకుండా చక్కగా నటించాడు.
లవ్, ఎమోషన్స్, డాన్స్, ఫైట్స్ ఇలా అన్ని విభాగాల్లో ధర్మ తనదైన శైలిలో ఆకట్టుకున్నారు. ఒకవైపు భగ్న ప్రేమికుడిగా..మరోవైపు తాగుబోతుగా కథ మొత్తం తన భుజాన వేసుకొని నడిపించాడు. ముఖ్యంగా భారీ ఎమోషన్స్ కూడా ఈజీగా పండించాడు. ఉన్నంతలో కామెడీ కూడా బాగానే చేశాడు. ధర్మలో హీరోకి కావాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయి కానీ సరైన కథలు ఎంచుకుంటేనే మంచి భవిష్యత్ ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment