Kajal Aggarwal and Her Husband Gautam Kitchlu Blessed With a Baby Boy - Sakshi
Sakshi News home page

Kajal Aggarwal: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన స్టార్‌ హీరోయిన్‌ కాజల్‌!

Published Tue, Apr 19 2022 6:18 PM | Last Updated on Tue, Apr 19 2022 7:07 PM

Kajal Aggarwal, Husband Gautam Kitchlu Blessed With Baby Boy - Sakshi

స్టార్‌ హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. కాజల్-గౌతమ్‌ కిచ్లు దంపతులకు మంగళవారం(ఏప్రిల్‌ 19) మగబిడ్డ పుట్టినట్టు ఒక్కసారిగా వార్తలు గుప్పుమన్నాయి. అయితే దీనిపై ఇప్పటి వరకు కాజల్‌ కానీ, ఆమె భర్త గౌతమ్‌ కిచ్లు కానీ అధికారిక ప్రకటన ఇవ్వలేదు. అయితే కాజల్‌ దంపతులకు మగబిడ్డ పుట్టాడంటూ పలు నేషనల్‌ వెబ్‌సైట్స్‌ తమ కథనంలో పేర్కొన్నాయి. అంతేకాదు ప్రముఖ సెలబ్రెటీ ఫొటోగ్రాఫర్‌ వైరల్‌ భయాని తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా కాజల్‌ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతూ ‘బేబీ బాయ్‌(Baby Boy)’ అని స్పష్టం చేశాడు.

చదవండి: ‘ఆచార్య’ రీషూట్‌పై స్పందించిన డైరెక్టర్‌ కొరటాల

దీంతో కాజల్‌ ఫ్యాన్స్‌ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు కాజల్‌ దంపతులకు శుభాకాంక్షలు కూడా తెలుపుతున్నారు. అయితే దీనిపై క్లారిటీ రావాలంటే కాజల్‌ దంపతుల నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి. కాగా ఎన్నో రూమర్ల అనంతరం కాజల్‌ జనవరిలో తన ప్రెగ్నెన్సీని ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి బేబీ బంప్‌ ఫొటోలను, భర్త గౌతమ్‌ కలిసి బేబీ బంప్‌ ఫొటోషూట్‌లను షేర్‌ చేస్తూ వచ్చింది. ఇక 2020 అక్టోబర్‌ 30న తన స్నేహితుడు, ముంబై వ్యాపారవేత్త అయిన గౌతమ్‌ కిచ్లును కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement