అగ్ర హీరోయిన్‌గా రాణిస్తూ పెళ్లి, పిల్లలు అంటూ సంసార జీవితంలోకి అడుగుపెడితే. ఇక ఆ నటి కెరీర్ అంతే. ఆ తరువాత అక్క, వదిన పాత్రలు వేసుకోవాల్సిందే అనే నానుడి చిత్ర పరిశ్రమలో ఉంది. నటి జ్యోతిక లాంటి కొందరు మాత్రం తమ వయసుకు తగ్గట్టుగా నటనకు అవకాశం ఉన్న పాత్రలను ఎంపిక చేసుకుని, గ్లామర్‌కు, రొమాన్స్‌కు దూరంగా నటిస్తున్నారు. అలాంటిది తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటిస్తూ క్రేజీ కథానాయకిగా రాణిస్తున్న నటి కాజల్ అగర్వాల్ అనూహ్యంగా పెళ్లి చేసుకొని ఓ బిడ్డకు తల్లి అయిన వెంటనే కేవలం రెండు నెలల గ్యాప్‌లోనే మళ్లీ నటించడానికి సిద్ధమయ్యారు.
అదీ హీరోయిన్‌గా.. కమలహాసన్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న ఇండియన్ –2 చిత్రం షూటింగ్ అనివార్య కారణాలు వల్ల మధ్యలో కొంతకాలం ఆగిపోయింది. అది నటి కాజల్ అగర్వాల్‌కు కలిసి వచ్చింది అనే చెప్పాలి. ఈ చిత్ర షూటింగ్ మళ్లీ ప్రారంభమయ్యేసరికి కాజల్ అగర్వాల్ పెళ్లి చేసుకుని ఒక బిడ్డకు జన్మనిచ్చి మళ్లీ నటించడానికి సిద్ధమైపోయారు. అదేమంటే తనకు నటనంటే చాలా ఇష్టమని పేర్కొంటున్నారు. కాగా తాజాగా తెలుగులో బాలకృష్ణ సరసన మరో భారీ చిత్రంలో నటించే అవకాశాన్ని ఈమె దక్కించుకున్నారు.
అంతేకాదు మరిన్ని అవకాశాల కోసం ఈ బ్యూటీ గ్లామర్‌ని ఆసరాగా చేసుకుంటున్నారు. సమయం దొరికినప్పుడల్లా తన గ్లామరస్ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. అలా ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి తన భర్తతో కలిసి వచ్చిన కాజల్ అగర్వాల్ తనదైన స్టైల్‌లో అందాలను ఆరబోశారు. ఆ ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అలా కాజల్ పెళ్లి అయిన తర్వాత కూడా గ్లామర్ విషయంలో తగ్గేదేలే అంటున్నారు.
గ్లామర్ విషయంలో తగ్గేదేలే..!
Published Mon, Apr 3 2023 7:14 AM | Last Updated on Mon, Apr 3 2023 8:47 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment