ప్రముఖ మలయాళ నటుడు పీసీ జార్జి(74) కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన త్రిసూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. పోలీసు అధికారిగా మంచిపేరు తెచ్చుకున్న ఆయన.. పదవి విరమణ తర్వాత పూర్తి స్థాయిలో సినిమాలపై దృష్టిపెట్టాడు. పలు మలయాళ చిత్రాల్లో విలన్ పాత్రలు పోషించారు.
‘అంబ అంభిక అంబాలిక’తో సినీ ఎంట్రీ ఇచ్చారు. ఒకవైపు పోలీసు అధికారిక బాధ్యలు నిర్వర్తిస్తూనే అప్పుడప్పుడు సినిమాల్లో నటించేవాడు. 1988లో మమ్ముట్టి నటించిన 'సంఘం' చిత్రం పీసీ జార్జికి మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత మళ్లీ నటుడిగా ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు. పీసీ జార్జి సుమారు 75 చిత్రాల్లో నటించారు. శనివారం త్రిసూరులో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.
చదవండి:
కరోనాతో నంద్యాల రవి కన్నుమూత
Comments
Please login to add a commentAdd a comment