బిగ్‌బాస్ కంటెస్టెంట్ పూజా రామచంద్రన్, తునివు విలన్ జాన్ కొకెన్ త్వరలో తల్లిదండ్రులు కాబోతున్న విషయం తెలిసిందే! గతేడాది నవంబర్‌లో తాను గర్భవతినన్న విషయాన్ని అభిమానులతో పంచుకుందీ నటి పూజా. 'అనేక భావోద్వేగాల మిళితమైన మా ప్రయాణం మరో కీలక దశకు చేరుకుంది. త్వరలో మా కుటుంబంలోకి మరొక వ్యక్తి రాబోతున్నారోచ్' అంటూ ట్వీట్ చేసి గుడ్‌న్యూస్ చెప్పింది. ఆ తర్వాత భర్తతో కలిసి థాయ్‌లాండ్‌కు వెకేషన్‌కు వెళ్లింది.
కడుపులో ఉన్న బిడ్డ కోసం యోగా కూడా చేస్తూ ఆ వీడియోలను సైతం ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. తాజాగా ఈ జంట మరోసారి విహారయాత్రకు వెళ్లినట్లు తెలుస్తోంది. తునివు సక్సెస్‌తో ఆనందంలో ఉన్న జాన్.. తన భార్యను వెంటపెట్టుకుని టూర్‌కు చెక్కేశాడు. అక్కడ భార్యాభర్తలిద్దరూ స్విమ్మింగ్ పూల్‌లో జలకాలాటలు ఆడారు. జాన్ చంకలో ఎక్కిన పూజా అతడిపై ముద్దుల వర్షం కురిపించింది. ఈ ఫోటోలను వారు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా అవి వైరల్‌గా మారాయి.
చదవండి: ప్రముఖ నిర్మాతకు హార్ట్ సర్జరీ
రెండు గ్రాముల గోల్డ్ కాయిన్స్ పంచిన కీర్తి సురేశ్
Comments
Please login to add a commentAdd a comment