Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today

Top Stories

ప్రధాన వార్తలు

Ysrcp Zptc Ramagovinda Reddy Was Unanimously Elected As Chairman Of Ysr Zilla Parishad1
వైఎస్సార్‌ జిల్లా జడ్పీ ఛైర్మన్‌ పదవి వైఎస్సార్‌సీపీ కైవసం

సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్‌ జిల్లా జడ్పీ ఛైర్మన్‌ పదవి వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. వైఎస్సార్‌ జిల్లా పరిషత్ చైర్మన్‌గా వైఎస్సార్సీపీ జడ్పీటీసీ రామగోవిందరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఒకే ఒక్క నామినేషన్ రావడంతో ఏకగ్రీవం అయినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. అనంతరం రామగోవిందరెడ్డి జడ్పీ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేశారు.కాగా, బ్రహ్మంగారిమఠం మండల జెడ్పీటీసీ సభ్యుడు ముత్యాల రామగోవిందురెడ్డిని వైఎస్సార్‌సీపీ చైర్మన్‌ అభ్యర్థిగా ఆపార్టీ ప్రకటించింది. రెండు పర్యాయాలుగా బి.మఠం జెడ్పీటీసీగా ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్నారు. పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా నేతలతో ప్రత్యేకంగా సమావేశమై రామగోవిందురెడ్డి అభ్యర్థిత్వాన్ని ఎంపిక చేశారు.కాగా, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఎన్నికలో టీడీపీ ద్వంద్వనీతి ప్రదర్శించింది. సంఖ్యాబలం లేని కారణంగా ప్రజాతీర్పుకు గౌరవించి చైర్మన్‌ ఎన్నికలో పోటీలో లేమంటూ టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఆర్‌ శ్రీనివాసులరెడ్డి ప్రకటించారు. వాస్తవాలు పరిశీలిస్తే అందుకు విరుద్ధమైన సంకేతాలు తెరపైకి వచ్చాయి. జిల్లా అధ్యక్షుడు పోటీలో లేమంటూనే మరోవైపు టీడీపీ జెడ్పీటీసీ జయరామిరెడ్డి ద్వారా ఎన్నికలను నిలుపుదల చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు.బరిలో నిలిచే శక్తి లేకపోవడంతో చైర్మన్‌ ఎన్నిక నిలుపుదల చేసేందుకు కుట్రలు పన్నారు. టీడీపీ జెడ్పీటీసీతోపాటు మరో 7మంది తెలుగుదేశం పార్టీ వర్గీయులు హైకోర్టును ఆశ్రయించారు. చైర్మన్‌ ఎన్నిక అడ్డుకునేందుకు శతవిధాలుగా ప్రయత్నించారు. స్టేటస్‌ కో తీసుకొచ్చేందుకు విశ్వప్రయత్నం చేశారు. చైర్మన్‌ ఎన్నిక నిలుపుదల చేసేందుకు, స్టేటస్‌కో ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించడం విశేషం. సమయం లభిస్తే జెడ్పీటీసీ సభ్యులను వశపర్చుకోవాలనే దుర్భుద్ధితోనే హైకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం.కాగా, చైర్మన్‌ ఎన్నికకు ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించుకోవాలని హైకోర్టు ఆదేశిస్తూనే తుది ఫలితం హైకోర్టు ఉత్తర్వులకు లోబడి ఉండాలని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇవాళ జరిగిన ఎన్నికలో వైఎస్సార్‌ జిల్లా పరిషత్ చైర్మన్‌గా వైఎస్సార్సీపీ జడ్పీటీసీ రామగోవిందరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికల అధికారి అయినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు.

YS Jagan Heavily Slams CBN Pawan Over Kasinayana Kshetram Row2
దేవుడు అంటే భక్తి, భయం ఉన్నది ఎవరికి?: వైఎస్‌ జగన్‌

గుంటూరు, సాక్షి: ఏపీలో కూటమి పాలనలో ఒకవైపు యధేచ్చగా జరుగుతున్న ఆలయాల కూల్చివేతలు, మరోవైపు హిందూ ధర్మంపై కొనసాగుతున్న దాడులపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తీవ్రంగా స్పందించారు. వైఎస్సార్‌సీపీ హయాంలోనే ఆలయాల పరిరక్షణ కొనసాగిందన్న ఆయన.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఆదేశాలతోనే ఇప్పుడు ఏపీలో ఆధ్యాత్మిక శోభ దెబ్బ తింటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.వైఎస్‌ జగన్‌(YS Jagan) ట్వీట్‌లో ఏమన్నారంటే.. నాకు వచ్చిన అర్జీ, దానికి సంబంధించిన విషయాలు విన్న తర్వాత ఈ ప్రభుత్వంపై నా కామెంట్‌ ఏంటంటే.., దేవుడు అంటే భక్తి, భయం ఉన్నది ఎవరికి?. ఎవరి హయాంలో ఆధ్యాత్మిక శోభ విలసిల్లింది? ఎవరి హయాంలో హైందవ ధర్మాన్ని పరిరక్షించారు? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రసిద్ధ కాశినాయన క్షేత్రం(Kasinayana Kshetram)లో కూల్చివేతలు, రాష్ట్రంలో ఆలయాలపైన, హిందూ ధర్మం(Hindu Dharmam)పై జరుగుతున్న దాడులకు ప్రత్యక్ష సాక్ష్యాలు కావా?.. .. అటవీ ప్రాంతంలో ఉన్న కాశినాయన క్షేత్రంలో నిర్మాణాల నిలిపివేత, వాటి తొలగింపుపై ఆగస్టు7, 2023న కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ ఆదేశాలు ఇచ్చినా, ఆ క్షేత్ర పరిరక్షణకు మా ప్రభుత్వం నడుంబిగించిన మాట వాస్తవం కాదా? అదే నెల ఆగస్టు 18, 2023న అప్పటి కేంద్ర అటవీశాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌గారికి ముఖ్యమంత్రి హోదాలో నేనే స్వయంగా లేఖరాసి కాశినాయన క్షేత్రం ఉన్న 12.98 హెక్టార్ల భూమిని అటవీశాఖ నుంచి మినహాయించాలని, ఆ క్షేత్రానికి రిజర్వ్‌ చేయాలని, దీనికోసం ఎలాంటి పరిహారం కోరినా, ఎలాంటి ఆంక్షలను విధించినా తు.చ.తప్పక పాటిస్తామని లేఖలో చాలా స్పష్టంగా చెప్పాం. మా ప్రయత్నాలతో కేంద్రం తన చర్యలను నిలుపుదల చేసింది. మా ఐదేళ్ల పాలనలో కాశినాయన క్షేత్రానికి వ్యతిరేకంగా ఎవ్వరూ ఒక్క చర్యకూడా తీసుకోలేదు. ఆలయాలపట్ల, ఆధ్యాత్మిక కేంద్రాల పరిరక్షణపట్ల మాకున్న చిత్తశుద్ధికి నిదర్శనం ఇది. .. మరోవైపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల నుంచే ఇదే కాశినాయన క్షేత్రంలో ఏం జరిగిందో రాష్ట్రం అంతా చూస్తోంది. ఒక ప్రసిద్ధ క్షేత్రంపై బుల్డోజర్లు నడిపి కిరాతకంగా, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో, కలెక్టర్‌ ఆదేశాలతో, ఆర్డీఓ పర్యవేక్షణలో కూల్చివేస్తూ వచ్చారు. చంద్రబాబు(Chandrababu)గారి ఆదేశాలమేరకు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌(Pawan Kalyan) పర్యవేక్షణలో ఉన్న తన పర్యావరణ, అటవీశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ ఇచ్చిన కూల్చివేత ఉత్తర్వులతో హిందూ ధర్మంపైన, ఆధ్యాత్మిక క్షేత్రాలపైన అధికార అహంకారంతో దాడిచేశారు. ఇవిగో ఆధారాలు, ఏమిటీ మీ సమాధానం? తామే ఉత్తర్వులిచ్చి, తమ చేతులతోనే కాశినాయన క్షేత్రాన్ని కూల్చేసి, వాతలు పెట్టి, వెన్నపూసిన మాదిరిగా ఇప్పుడు మాటలు చెప్తున్నారు. వీళ్ల తీరే అంత? .. ఈ ప్రభుత్వం వచ్చాకే వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రతిష్టను దిగజారుస్తూ జరిగిన తిరుమల లడ్డూ దుష్ప్రచార వ్యవహారమైనా, టీటీడీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా తొక్కిసలాటలో భక్తులు మరణించిన ఘటన విషయంలోనైనా, ఇప్పుడు కాశినాయన క్షేత్రంలో గుడి కూల్చివేతలైనా.. ఇలా ఏదైనా అంతే. ఆలయాలపై వివిధ రూపాల్లో దాడులు చేసేదీ వీళ్లే, అబద్ధాలను ప్రచారం చేసేదీ వీళ్లే, మళ్లీ ధర్మ పరిరక్షకులుగా తమనుతాము చిత్రీకరించుకునేది వీళ్లే. .. ఒకరు ఆదేశిస్తారు, మరొకరు పర్యవేక్షిస్తారు. సనాతన వాదిగా చెప్పుకుంటూ కాశీనాయన క్షేత్రంలో కూటమి ప్రభుత్వం చేసిన దారుణాలకు బాధ్యత వహించాల్సిన, అటవీశాఖను చూస్తున్న డిప్యూటీ సీఎం, తన శాఖ పరిధిలోనే జరిగిన ఈ కూల్చివేతలపై ఇప్పటివరకూ ఒక్క మాటకూడా మాట్లాడలేదు. ఇలాంటి వీరికి హిందూ ధర్మంపైన, ఆలయాల పరిరక్షణపైనా మాట్లాడే హక్కు ఉందా? అని వైఎస్‌ జగన్‌ నిలదీశారు.నాకు వచ్చిన అర్జీ, దానికి సంబంధించిన విషయాలు విన్న తర్వాత ఈ ప్రభుత్వంపై నా కామెంట్‌ ఏంటంటే.., దేవుడు అంటే భక్తి, భయం ఉన్నది ఎవరికి? ఎవరి హయాంలో ఆధ్యాత్మిక శోభ విలసిల్లింది? ఎవరి హయాంలో హైందవ ధర్మాన్ని పరిరక్షించారు? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రసిద్ధ కాశినాయన క్షేత్రంలో… pic.twitter.com/gTRsvBfnia— YS Jagan Mohan Reddy (@ysjagan) March 27, 2025

Ysrcp Candidate Alla Subbamma Won As The Tripuranthakam Mpp3
కూటమి కుట్రలు పటాపంచలు.. ఈ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ ఘన విజయం

సాక్షి, ప్రకాశం జిల్లా: త్రిపురాంతకం ఎంపీపీ ఎన్నికల్లో టీడీపీకి భంగపాటు ఎదురైంది. త్రిపురాంతకం ఎంపీపీగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఆళ్ల సుబ్బమ్మ విజయం సాధించారు. అక్రమ కేసులతో భయపెట్టినా వైఎస్సార్‌సీపీకే ఎంపీటీసీలు పట్టం కట్టారు. టీడీపీ ప్రలోభాలకు గురిచేసినా త్రిపురాంతకం-2 ఎంపీటీసీ సృజన లొంగలేదు. ఎన్నికల హాలులోనే సృజనపై టిడిపి ఎంపీటీసీలు దాడికి కూడా యత్నించారు. సృజనా ఎత్తిన చేయిని బలవంతగా దించివేయడానికి కూటమి అభ్యర్థి చల్లా జ్యోతి ప్రయత్నించింది.మండల ప్రజా పరిషత్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో జరిగిన ఎంపీపీ, వైస్ ఎంపీపీ స్థానాలలో వైఎస్సార్ సీపీ గెలిచింది. టీడీపీ ప్రజాప్రతినిధులు ప్రలోభాలు పెట్టినా... వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలు మాత్రం వారి ఒత్తిడి కి తలొగ్గలేదు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో హైడ్రామా మధ్య మండల ప్రజా పరిషత్ ఎన్నికలు జరిగాయి. ఐదు ఎంపీపీ, నాలుగు వైస్ ఎంపీపీ స్థానాలకు ఈరోజు ఎన్నికలు జరిగాయి.కళ్యాణదుర్గం నియోజకవర్గం కంబదూరు ఎంపీపీ స్థానంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి లక్ష్మి దేవి విజయం సాధించారు. పెనుకొండ నియోజకవర్గం రొద్దం ఎంపీపీ స్థానంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థి నాగమ్మ గెలుపొందారు. రాయదుర్గం నియోజకవర్గం కణేకల్ ఎంపీపీ స్థానం లో వైఎస్సార్ సీపీ అభ్యర్థి వండ్రయ్య విజయం సాధించారు.వైఎస్సార్ సీపీ అభ్యర్థులకు మద్దతుగా మెజారిటీ ఎంపీటీసీలు చేతులెత్తడంతో ఎన్నిక ప్రక్రియ పూర్తి అయ్యింది. కదిరి నియోజకవర్గం గాండ్లపెంట ఎంపీపీ ఎన్నిక వాయిదా పడింది. కదిరి టీడీపీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ప్రలోభాలు.. బెదిరింపులకు దిగారు. అయినప్పటికీ వైఎస్సార్ సీపీ ఎమ్మీటీసీలు లొంగలేదు. కోరం ఉన్నా సంతకాలు తీసుకోవడంలో అధికారులు జాప్యం చేయడం, సమయం పూర్తి కావడంతో గాండ్లపెంట ఎంపీపీ ఎన్నిక వాయిదా వేశారు.రాప్తాడు నియోజకవర్గం రామగిరిలో ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఎంపీపీ ఎన్నిక వాయిదా పడింది. వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలకు పోలీసులు సరైన భద్రత కల్పించకపోవడంతో సమయానికి సభ్యులు రాక రామగిరి ఎంపీపీ ఎన్నిక వాయిదా పడింది. ఎంపీపీ ఎన్నికల్లో వైఎస్సారసీపీ విజయం సీఎం చంద్రబాబబుకు చెంపపెట్టు అని శ్రీసత్యసాయి జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషాశ్రీచరణ్ స్పష్టం చేశారు.తిరుపతి రూరల్‌ ఎంపీపీ స్థానం వైఎస్సార్‌సీపీ సొంతం చేసుకుంది. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మూలం చంద్రమౌళిరెడ్డి గెలుపొందారు. ఆయనకు 33 మంది వైఎస్సార్‌సీపీ సభ్యులు మద్దతునిచ్చారు. విశాఖ జిల్లా నర్సీపట్నం నియోజకవర్గ మాకవరపాలెం ఎంపీపీగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి రుత్తుల సర్వేశ్వరరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బలం లేకపోవడంతో టీడీపీ ఎంపీటీసీలు పోటీకి దూరంగా ఉన్నారు. మాడుగుల ఎంపీపీగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి తాళ్లపురెడ్డి రాజారాం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎస్‌. రాయవరం మండల ఎంపీపీగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కేసుబోయిన వెంకటలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దేవరపల్లి మండలం ఎంపీపీగా చింతల భూలోక లక్ష్మీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

CM Revanth Reddy Counters BRS KTR Revenge Politics Speech In Assembly4
నన్ను జైల్లో పెట్టి హింసించినా.. రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడలేదు: సీఎం రేవంత్‌

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతోందన్న బీఆర్‌ఎస్‌​ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావు వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ రెడ్డి(Revanth Reddy) స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల చివరి రోజు.. గురువారం మధ్యాహ్నాం సెషన్‌లో తొలుత కేటీఆర్‌ ప్రసంగించగా.. ఆ ఆరోపణలపై సీఎం రేవంత్‌ స్పందించారు. రాజకీయ కక్ష సాధింపు ఎవరిది? మీదా? నాదా?.. ఎవరైనా అనుమతి లేకుండా డ్రోన్‌ ఎగరేస్తే రూ.500 ఫైన్‌ విధిస్తారు. కానీ, డ్రోన్‌ ఎగరేశానని బీఆర్‌ఎస్‌ హయాం(BRS Rule)లో నాపై కేసు పెట్టారు. అధికారం అడ్డుపెట్టుకుని ఎంపీగా ఉన్న నన్ను చర్లపల్లి జైల్లో పంపారు. నన్ను జైల్లో ఉంచి చిత్రహింసలకు గురి చేశారు. నక్సలైట్లు, దేశ ద్రోహులు ఉండె డిటెన్షన్‌ సెల్‌లో పార్లమెంట్‌ సభ్యుడినైన నన్ను వేశారు. నేను పడుకోకుండా రాత్రిళ్లు లైట్లు వేశారు. జైల్లో 16 రోజులు నిద్రలేని రాత్రులు గడిపా. .. చర్లపల్లి జైలు నుంచి నా బిడ్డ లగ్నపత్రిక రాసుకోవడానికి వెళ్లకుండా అడ్డుకున్నారు. నా బిడ్డ లగ్గానికి రాకుండా ఢిల్లీ నుంచి అడ్వకేట్‌లను తీసుకొచ్చారు. చర్లపల్లి జైలు నుంచి ఫంక్షన్ హాల్ కు వచ్చి.. మళ్ళీ జైలుకు పోయా. నా కుటుంబ సభ్యులను అసభ్యంగా తిట్టినా భరించా. సొంతపార్టీ ఆఫీసులో బూతులు తీయించి రికార్డు చేయించినా… చెంపలు వాయించే శక్తి ఉన్నా నేను సంయమనం పాటించా. దేవుడు అన్ని చూస్తుంటాడంటూ సహనంతో ఎదురు చూశా. అంతేకానీ.. కేసీఆర్‌ కుటుంబంపై ఏనాడూ.. ఎలాంటి రాజకీయ కక్ష చర్యలకు పాల్పడలేదు. వారిని జైలుకు పంపుతానన్న హామీని కూడా నెరవేర్చలేదు. నేను ప్రమాణ స్వీకారం చేసిన రోజే.. కేసీఆర్ కుటుంబంలో ఏం జరగాలో అది జరిగింది. నా మీద కక్ష చూపిన వారిని ఆ దేవుడే ఆసుపత్రిపాలు చేశాడు. నేను నిజంగానే కక్ష సాధింపు చర్యలకు పాల్పడి ఉంటే ఇవాళ కేటీఆర్‌(KTR) అసెంబ్లీలో కూర్చొని ఇలా మాట్లాడేవారు కాదు. ప్రజలు రాష్ట్ర అభివృద్ధి కోసం నాకు అధికారం ఇచ్చారు. కక్షలు తీర్చుకోవడానికి కాదు. ఎవరివి కక్ష సాధింపు చర్యలో తెలంగాణ సమాజం ఇదంతా గమనిస్తోంది’’ అని సీఎం రేవంత్‌ అన్నారు. ఇదీ చదవండి: అది నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తా: కేటీఆర్‌

Govt Job Rs 4 Crore Or A Plot: Vinesh Phogat Given State Benefits Choice But5
రూ. 4 కోట్లా? ప్రభుత్వ ఉద్యోగమా?.. స్థలమా?.. ఏది కావాలి?

ప్యారిస్‌ ఒలింపిక్స్‌-2024 (Paris Olympics)లో సత్తా చాటిన భారత రెజ్లర్‌, ప్రస్తుత కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వినేశ్‌ ఫొగట్‌ (Vinesh Phogat)కు.. హర్యానా ప్రభుత్వం మూడు ఆప్షన్లు ఇచ్చింది. ‘‘రూ. 4 కోట్లా? ప్రభుత్వ ఉద్యోగమా?.. లేదంటే ప్లాట్‌’’.. వీటిలో ఆమెకు ఏదీ కావాలో చెప్పాలని కోరింది. కాగా వినేశ్‌ ఫొగట్‌ తృటిలో ఒలింపిక్‌ పతకాన్ని చేజార్చుకున్న విషయం తెలిసిందే.మహిళల యాభై కిలోల కుస్తీ విభాగంలో అద్భుత ప్రదర్శనలతో ఫైనల్‌కు చేరిన వినేశ్‌.. ఈ ఘనత సాధించిన తొలి భారత మహిళా రెజ్లర్‌గా చరిత్ర సృష్టించారు. అయితే, అనూహ్య రీతిలో టైటిల్‌ పోరుకు ముందు.. పోటీలో పాల్గొనకుండా ఆమెపై వేటు పడింది. నిర్ణీత బరువు కంటే వంద గ్రాములు ఎక్కువగా ఉన్న కారణంగా పతకం కోసం పోటీ పడే అవకాశం చేజారింది.కనీసం రజతమైనా ఇవ్వాలని అప్పీలుఆ తర్వాత స్పోర్ట్స్‌ కోర్టులో కనీసం రజతమైనా ఇవ్వాలని అప్పీలు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఒక్క గ్రాము బరువు ఎక్కువగా ఉన్నా పోటీకి, పతకానికి అనర్హులే అంటూ కోర్టు వినేశ్‌ ఫొగట్‌ పిటిషన్‌ను కొట్టి వేయడంతో ఆమెతో పాటు యావత్‌ భారతావనికి నిరాశే మిగిలింది.అయితే, ఫైనల్‌ వరకు వినేశ్‌ చేరిన తీరును ప్రశంసిస్తూ అభినందలు వెల్లువెత్తాయి. ఓడినా మనసులు గెలిచిందంటూ ఆమెపై ప్రశంసల జల్లు కురిసింది. నాడు.. ప్రస్తుత హర్యానా ముఖ్యమంత్రి నయాబ్‌ సింగ్‌ సైనీ సైతం.. ‘‘హర్యానాకు గర్వకారణమైన ఫొగట్‌ గౌరవాన్ని మేము మరింత పెంచుతాం’’ అని ట్వీట్‌ చేశారు.కుస్తీకి వీడ్కోలు పలికి..రాజకీయ రంగ ప్రవేశంఅంతేకాదు.. రాష్ట్ర క్రీడా విధానాన్ని అనుసరించి ఒలింపిక్స్‌లో రజతం గెలిచిన ఆటగాళ్లకు ఇచ్చే నజరానాను వినేశ్‌కు అందిస్తామనే హామీ అందింది. అయితే, ఆ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. అనూహ్య రీతిలో పతకం చేజారిన చేదు అనుభవాన్ని జీర్ణించుకోలేక వినేశ్‌ ఫొగట్‌ కుస్తీకి వీడ్కోలు పలికి..రాజకీయ రంగ ప్రవేశం చేశారు.కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఝులానా నియోజకవర్గంలో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిన ఆమె.. అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఈ క్రమంలో క్రీడాకారుల కోటాలో తనకు అందాల్సిన నజరానా గురించి ఇటీవల విధాన సభలో ప్రస్తావించారు.హామీ మరిచారా?‘‘వినేశ్‌ ఫొగట్‌ మా కూతురు. ఒలింపిక్‌ సిల్వర్‌ మెడలిస్ట్‌కు ఇచ్చే రివార్డును ఆమెకు అందజేస్తాం అని ముఖ్యమంత్రి గారు చెప్పారు. కానీ ఇంత వరకు ఆ హామీని పూర్తి చేయలేకపోయారు.ఇది కేవలం డబ్బుకు సంబంధించిన విషయం కాదు. గౌరవానికి సంబంధించిన అంశం. ఈ రాష్ట్రంలో చాలా మంది క్రీడాకారులకు ఇప్పటికే రివార్డులు అందజేశారు’’ అని వినేశ్‌ ఫొగట్‌ బీజేపీ ప్రభుత్వ తీరును విమర్శించారు.ఈ నేపథ్యంలో మంగళవారం నాటి కేబినెట్‌ సమావేశంలో వినేశ్‌ ఫొగట్‌ రివార్డుకు సంబంధించి ముఖ్యమంత్రి నయాబ్‌ సింగ్‌ సైనీ నిర్ణయం తీసుకున్నారు. ‘‘వినేశ్‌ ఫొగట్‌ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. తన క్యాష్‌ రివార్డుకు సంబంధించిన అంశాన్ని ఆమె విధాన సభలో లేవనెత్తారు.ఈ మూడింటిలో ఏది కావాలి?అందుకే కేబినెట్‌ ప్రత్యేకంగా ఈ విషయంపై చర్చింది. స్పోర్ట్స్‌ పాలసీ ప్రకారం ఆమెకు ప్రయోజనాలు చేకూర్చాలని నిశ్చయించింది’’ అని తెలిపారు. నిబంధనల ప్రకారం.. రూ. 4 కోట్ల క్యాష్‌ ప్రైజ్‌.. లేదంటే ప్రభుత్వ ఉద్యోగం.. లేదా హర్యానా షహరీ వికాస్‌ ప్రాధికారణ్‌ పథకం కింద ప్లాట్‌.. ఈ మూడింటిలో ఏదో ఒకటి తీసుకోవాలని కేబినెట్‌ వినేశ్‌ ఫొగట్‌కు ఆఫర్‌ ఇచ్చింది. అయితే, ఆమె ఇంతవరకు స్పందించకపోవడం గమనార్హం. ఇక తాను తల్లి కాబోతున్నట్లు ఇటీవలే వినేశ్‌ ఫొగట్‌.. తన భర్త, రెజ్లర్‌ సోమ్‌వీర్‌ రాఠీతో కలిసి శుభవార్త పంచకున్న విషయం తెలిసిందే.చదవండి: ‘విడాకులు మాత్రమే కావాలి.. నేనేమీ బికారిని కాదు.. ఆ దెయ్యం డబ్బు నాకొద్దు’

Telangana Assembly Session March 27th Live Updates6
తెలంగాణ అసెంబ్లీలో డీలిమిటేషన్‌పై తీర్మానం

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు అప్‌డేట్స్‌.. 👉అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. 👉20 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైన శాసనమండలి..డీలిమిటేషన్‌పై తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం పెట్టిన సీఎం రేవంత్‌ రెడ్డి. రేవంత్‌ కామెంట్స్‌.. జనాభా తగ్గిన రాష్ట్రాలు నష్టపోకూడదు. పునర్విభజనకు జనాభా ఒక్కటే ప్రామాణికం కాకూడదు. జనాభా నియంత్రణ శాపంగా మారకూడదు. రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకుని నియోజకవర్గ పునర్విభజన చేయాలి. కేంద్రం నిర్ణయంతో ప్రజల్లో ఆందోళన నెలకొందిఅన్ని పార్టీలతో సంప్రదింపులు జరపాలి. ఆ తర్వాతే లోక్‌సభ సీట్ల పునర్విభజన జరగాలి.డీలిమిటేషన్‌పై కేంద్ర ప్రభుత్వం చర్యలే తీసుకోలేదు.ఎందుకు ఈ హడావిడి అని కేంద్రమంత్రులు మాట్లాడుతున్నారు.జనాభా నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం విధివిధానాలు ఖరారు చేసింది..జనాభా నియంత్రణను దక్షిణ భారత దేశం పాటిస్తే..ఉత్తరాది రాష్ట్రాలు నియంత్రణ చేయకపోవడంతో జనాభా పెరిగింది2026 తర్వాత జనాభా లెక్కించి.. దాని ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన చేయాల్సి ఉండటంతో ఇది చర్చనీయాంశమైంది.1971 జనాభా లెక్కల తర్వాత కేంద్రం.. జనాభా నియంత్రణ విధివిధానాలను తీసుకువచ్చింది.ఇందిరాగాంధీ, వాజ్‌పేయి.. 25ఏళ్ల పాటు నియోజకవర్గాల పునర్విభజనను వాయిదా వేశారు.డీలిమిటేషన్‌ ఈజ్‌ లిమిటేషన్‌ ఫర్‌ సౌత్‌.ప్రస్తుత జనాభా ప్రకారం ఎస్సీ, ఎస్టీ సీట్లను పెంచాలి.ఉత్తరాది రాష్ట్రాలు జనాభా నియంత్రణ చేయలేదు.కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ద్వంద్వ విధానాలను నిరసిస్తూ.. అసెంబ్లీలో తీర్మానం పెట్టాం. సౌత్‌కు అన్యాయం జరుగుతుందని ఇందిరాగాంధీ గతంలోనే గుర్తించారు.2011 జనాభా లెక్కల ప్రకారం జమ్ము కశ్మీర్‌, సిక్కిం అసెంబ్లీలలో సీట్లు పెంచారు.డీలిమిటేషన్‌తో 24 శాతం ఉన్న దక్షిణాది ఎంపీల సంఖ్య 19 శాతానికి తగ్గిపోతుంది. హరీష్ రావు కామెంట్స్‌..ఈ సెషన్‌లో ఒక్కరోజు మాత్రమే క్వశ్చన్ అవర్ పెట్టారు..క్వశ్చన్ అవర్ లేకపోవడంతో సభ్యుల అనుమానాలు నివృత్తి కావడం లేదు..ఇకనైనా వీలైనన్ని రోజులు క్వశ్చన్ అవర్‌తో పాటు జీరో అవర్ పెట్టాలి.శ్రీధర్ బాబు కామెంట్స్‌..అర్ధరాత్రి వరకు సభ నడుపుతున్నాం.ప్రతీ సభ్యుడికి మాట్లాడే అవకాశం ఇస్తున్నాం..సభ్యులు అడిగిన ప్రతీ ప్రశ్నకు లేఖ ద్వారా సమాధానం తెలియజేస్తాం. తెలంగాణ అసెంబ్లీలో కాగ్ రిపోర్టును ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం భట్టి.2023-24 ఏడాది కాలంతో కలిపి గత ఐదేళ్లలో 4లక్షల 3వేల 664 కోట్ల అప్పులు చేసినట్లు తెలిపిన కాగ్.2023-24 ఏడాదిలో పబ్లిక్ మార్కెట్ నుంచి 49,618 కోట్ల అప్పులు తెచ్చిన ప్రభుత్వం.గత ఏడాది కాలంలో 200 శాతం FRBM పరిధి పెరిగినట్లు తెలిపిన కాగ్2023-24లో తెలంగాణ రెవెన్యూ సర్ ప్లస్ 779 కోట్లుగా పేర్కొన్న కాగ్.2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఫైనాన్స్ అకౌంట్స్, అప్రోప్రియేషన్ అకౌంట్స్ పై నివేదిక2023-24 బడ్జెట్ అంచనా 2,77,690 కోట్లు, చేసిన వ్యయం 2,19,307 కోట్లుబడ్జెట్ అంచనాలో 79 శాతం వ్యయంజీఎస్డీపీలో వ్యయం అంచనా 15 శాతంఆమోదం పొందిన బడ్జెట్ కంటే అదనంగా అంచనాల్లో 33 శాతం 1,11,477 కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం349 రోజుల పాటు 10,156 కోట్లు వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ సదుపాయాన్ని వినియోగించుకున్న ప్రభుత్వం35,425 కోట్ల ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయాన్ని 145 రోజుల పాటు వినియోగించుకున్న ప్రభుత్వం2023-24లో వడ్డీల చెల్లింపుల కోసం 24,347 కోట్ల వ్యయంవేతనాలకు 26,981 కోట్లు ఖర్చుఖజానాకు పన్ను ఆదాయం నుంచే 61.83 శాతం నిధులు2023-24లో కేంద్రం నుంచి వచ్చిన గ్రాంట్ల మొత్తం కేవలం 9934 కోట్లురెవెన్యూ రాబడుల్లో 45 శాతం వేతనాలు, వడ్డీ చెల్లింపులు, పెన్షన్‌లకే ఖర్చు2023-24లో రెవెన్యూ మిగులు 779 కోట్లురెవెన్యూ లోటు 49,977 కోట్లు,జీఎస్డీపీలో రెవెన్యూ లోటు శాతం 3.332023-24 ముగిసే వరకు రుణాల మొత్తం 4,03,664 కోట్లు, జీఎస్డీపీలో అప్పుల శాతం 272023-24 వరకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీల మొత్తం 2,20,607 కోట్లు2023-24 లో తీసుకున్న 50,528 కోట్లలో 43,918 కోట్లను మూలధనం వ్యయం పై ఖర్చు చేసిన ప్రభుత్వం2023-24 లో స్థానిక సంస్థలు, ఇతర సంస్థలకు ప్రభుత్వం ఇచ్చిన నిధులు 76,773 కోట్లు, 11 శాతం పెరుగుదలశాసన మండలి ఆవరణలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీల నిరసనరైతు రుణమాఫీ చేయాలని శాసనమండలి ఆవరణలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీల నిరసనప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేసిన ఎమ్మెల్సీలురైతు రుణమాఫీ బోగస్‌ అంటూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీల నినాదాలు కాసేపట్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.నేటితో ముగియనున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.సభలో కాగ్ రిపోర్ట్ పెట్టనున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కద్రవ్యవినిమయ బిల్లుకు ఆమోదం తెలుపనున్న అసెంబ్లీఅసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కామెంట్స్‌..ఎమ్మెల్యే కేపీ వివేకానంద..బీజేపీ, కాంగ్రెస్ ఇద్దరు గల్లీలో దోస్తీ.. ఢిల్లీలో కుస్తీ అని మొదటి నుండి చెబుతున్నాం..నిన్న అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్, బీజేపీ మధ్య పొత్తు అర్థం అయ్యింది..అసెంబ్లీ సమావేశంలో మా హరీష్ రావు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు లేక.. బీజేపీ ఎమ్మెల్యేలతో స్క్రిప్ట్ రాసి చదివిపిస్తుంది కాంగ్రెస్..కాంగ్రెస్ పార్టీ రాసిచ్చిన స్క్రిప్ట్ నే బీజేపీ ఎమ్మెల్యేలు, కేంద్ర మంత్రులు చదువుతున్నారు..నిన్న సభలో ఉత్తమ్ కుమార్ రెడ్డి వద్ద సమాధానం లేక బీజేపీ ఎమ్మెల్యేలకు ఇచ్చి మాట్లాడించారు..అన్ని అనుమతులతో కాళేశ్వరం కట్టాము..అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉంది బీజేపీ పార్టీనే..మరి కేంద్రంలో బీజేపీ పార్టీ సమర్థవంతంగా పని చేయడం లేదా అని ప్రశ్నిస్తున్నాము..కాంగ్రెస్ తరపున మాట్లాడడం కంటే.. నేరుగా కాంగ్రెస్ కండువా కప్పుకుంటే సరిపోతుంది..ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అబద్దాలపై ఏర్పడిన ప్రభుత్వం..తమ హామీలు, తమ బాధ్యతలు విస్మరిస్తూ పరిపాలన చేస్తున్నారు..అధికారంలో రాక ముందు పీఆర్సీ, డీఏ లు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు..ఈ రోజు మా పార్టీ తరపున సభలో వాయిదా తీర్మానం పెడుతున్నాం..తప్పకుండా ఉద్యోగులకు ప్రకటించిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నాం..ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్..మోడీ దేశంలో కాంగ్రెస్ హఠావో అంటున్నారు..తెలంగాణలో బీజేపీ నేతలు కాంగ్రెస్ బచావ్ అంటున్నారు..బీజేపీ నేతలు రేవంత్ రెడ్డితో డీలింగ్ చేసుకుంటున్నారు..భట్టి అంటే మాకు గౌరవం ఉండేది..ఇప్పుడు భట్టి అహంకారంతో మాట్లాడుతున్నారు..గత అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని మొహం ఎక్కడ పెట్టుకుంటారని అన్నారు..నిన్న ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని భట్టి అన్నారు..30 శాతం కమీషన్ తీసుకుంటున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంటున్నారు..మా దగ్గర కమిషన్ తీసుకుంటున్నారని కాంట్రాక్టర్లు అంటున్నారు..దేశంలో ఎక్కడా లేని విధంగా సెక్రటేరియట్ లో కాంట్రాక్టర్లు ధర్నా చేశారు..నిన్న భట్టి మాట్లాడిన మాటలను ఉపసంహరించుకోవాలి..భట్టి రోజు రోజుకి అహంకారపూరితంగా మాట్లాడుతున్నారు..భట్టి తన గౌరవాన్ని నిలబెట్టుకోవాలి..ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి..సభలో శాంతి భద్రతలపై మాట్లాడితే మైక్ కట్ చేశారునా ఇంటిపై ఎమ్మెల్యే గాంధీతో పాటు రౌడీలు నా ఇంటిపై దాడి చేశారునన్ను హత్య చేసేందుకు ప్రయత్నించారుసైబరాబాద్ డీసీపీ, మాదాపూర్ ఏసీపీ స్వయంగా రౌడీ షీటర్లను తీసుకొచ్చి హత్య ప్రయత్నం చేశారుఇప్పటికే ఏడాది గడుస్తున్న వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదుశాసన సభ్యుడుగా నాకే భద్రత లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటి?.సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నా సైబరాబాద్ డీసీపీ మాదాపూర్ ఏసీపీని సస్పెండ్ చేయాలినన్ను హత్య చేసేందుకు వచ్చిన గాంధీపై త్రీ నాట్ సెవెన్ కేసు బుక్ చేశారుఇప్పటివరకు ఎందుకు అరెస్ట్ చేయలేదురాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా?నా ఫోన్ ట్యాపింగ్‌ అవుతుందని కంప్లైంట్ చేస్తే ఉల్టా నా పైనే కేసు పెట్టి బలవంతంగా మా ఇంటి డోర్లు పగలగొట్టి తీసుకెళ్లారుపార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో నిన్న సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.కేసు సుప్రీంకోర్టులో ఉండగా ఉప ఎన్నికలు రావని ప్రకటన చేశారుదీనిపై ఏప్రిల్ 2న సీఎం వ్యాఖ్యలపై సుప్రీం దృష్టికి తీసుకెళ్తాంపార్టీ మారిన 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు తప్పవుప్రభుత్వ నిర్లక్ష్యంతో నా నియోజకవర్గంలో పంటలు ఎండిపోతున్నాయిమంత్రి పొంగులేటికి సంబంధించిన రాఘవ కన్ స్ట్రక్షన్ కంపెనీని బ్లాక్‌లిస్టులో పెట్టాలిసుంకేశాల కన్ స్ట్రక్షన్ చేసిన కంపెనీని బ్లాక్ లిస్టులో పెట్టాలికాళేశ్వరం ప్రాజెక్టు తో 18 లక్షల ఎకరాలకు సాగునీరు అందించారు కేసీఆర్‌చిన్న కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం లేదు.. వెంటనే వారికి బిల్లు చెల్లించాలి

Do You Know About Signal Messaging App And How Secure is It7
మూడో కంటికి చిక్కని ‘సిగ్నల్‌’.. ఈ యాప్ గురించి తెలుసా?

వాట్సాప్ మాదిరిగానే.. అమెరికాలో 'సిగ్నల్‌' (Signal) అనే మెసేజింగ్ యాప్‌ను చాటింగ్ చేయడానికి ఉపయోగిస్తారు. తాజాగా ఈ యాప్ నుంచే యెమెన్ వైమానిక దాడులకు సంబంధించిన ప్రణాళికలు బయటకు పొక్కాయి. ఈ నేపథ్యంలో ఈ యాప్‌ కోసం ఆరా తీసేవాళ్లు పెరిగిపోయారు. ఇంతకీ ఈ యాప్ ఏమిటి?, దీనిని ఎవరు ప్రారంభించారు?.. అమెరికా అధ్యక్ష భవనం సిబ్బంది ఈ యాప్‌ను వినియోగించడానికి ఏమైనా ప్రత్యేకత ఉందా?.. వివరాల్లోకి వెళ్తే..సిగ్నల్ అనేది మెసేజింగ్ యాప్. దీనిని 'మోక్సీ మార్లిన్‌స్పైక్' (Moxie Marlinspike) రూపొందించారు. సిగ్నల్ యాప్ ద్వారా టెక్స్ట్ మెసేజస్, ఫోటోలు, రికార్డ్స్ వంటివి షేర్ చేసుకోవచ్చు. వాట్సాప్‌ తరహాలోనే మెసేజ్ పంపిన వారు, రిసీవ్ సీగేసుకున్న వారు మాత్రమే సందేశాలను చూడగలరు. ఒక నిర్ణీత సమయం తరువాత సమాచారం కనిపించకుండా చేసే ఆప్షన్ కూడా ఇందులో ఉంది. మూడో మనిషి చూడటానికి అవకాశం లేదు. అయితే.. సిగ్నల్‌కు వాట్సాప్ కంటే అత్యంత సురక్షితమైనదనే ప్రచారం ఉంది. సురక్షితమైన యాప్ కావడంవల్లే అమెరికాలోని ఫెడరల్‌ అధికారులు, వైట్‌హౌజ్‌ సిబ్బంది దీనిని ఉపయోగిస్తుంటారు.ఇదీ చదవండి: ఇదే జరిగితే.. ఆ బైకులు, మద్యం ధరలు తగ్గుతాయిసిగ్నల్‌ మెసేజింగ్ యాప్‌ను ప్రపంచవ్యాప్తంగా.. ఏడు కోట్లమంది ఉపయోగిస్తున్నట్లు(ఇప్పటిదాకా డౌన్‌లోడ్లు) గణాంకాలు చెబుతున్నాయి. దీనిని ఎక్కువ మంది ఉపయోగించడానికి ప్రధాన కారణం.. ఇది సాధారణ వాట్సాప్, మెటా మెసెంజర్ కంటే కూడా సురక్షితమైనది కావడమనే ముద్రపడిపోవడం. లీక్ ఇలా.. యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులపై.. దాడికి సంబంధించిన వ్యూహాలను రహస్యంగా ‘సిగ్నల్‌’ యాప్‌ గ్రూప్‌చాట్‌లో చర్చిస్తూ 'జెఫ్రీ గోల్డ్‌బర్గ్‌' అనే సీనియర్‌ పాత్రికేయుడిని ఆ గ్రూప్‌లో చేర్చుకున్నారు. ఆ తరువాత కీలక సమాచారం లీక్‌ అయ్యి రచ్చ రాజేసింది.

Ktr Slams Telangana Bjp Central Ministers8
‘ఒకరు సహాయ మంత్రి.. ఇంకొకరు నిస్సహాయ మంత్రి’.. అసెంబ్లీలో కేటీఆర్‌ సెటైర్లు

సాక్షి,హైదరాబాద్‌: మాకు పార్లమెంట్‌ ఎన్నికల్లో గుండు సున్నా వచ్చింది నిజమే. కానీ కేంద్రం బడ్జెట్‌లో తెలంగాణకు వచ్చింది గుండు సున్నానే. పురావస్తు శాఖ చరిత్రను తవ్వినట్లు.. గత ప్రభుత్వం, గత ప్రభుత్వము అని తవ్వుతూనే ఉంది. మరి కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే కేంద్రాన్ని ఒక్క మాట కూడా అనడం లేదని మాజీ మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. తెలంగాణ అసెంబ్లీలో కేటీఆర్‌ మాట్లాడారు. ‘కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ది వేగంగా జరిగింది. బీఆర్‌ఎస్‌ హయాంలో తెలంగాణ అన్నీ రంగాల్లో అభివృద్ధిని సాధించింది. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి రాష్ట్రం పేరు ఎక్కడా వినపడలేదు. అధికారంలోకి ఎవరు వచ్చినా రాష్ట్రాభివృద్ధే మాకు ముఖ్యం.తెలంగాణా పథకాలను కేంద్రం కాపీ కొట్టింది. రాష్ట్రానికి ఎన్నోసార్లు కేంద్రం అన్యాయమే చేసింది. డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ అంటే ఏంటి? మాకు పార్లమెంట్‌ ఎన్నికల్లో గుండు సున్నా వచ్చింది నిజమే. కానీ కేంద్రం బడ్జెట్‌లో తెలంగాణకు వచ్చింది గుండు సున్నానే. 2014 నుంచి కేంద్రంతో సఖ్యతతో ఉండి రాష్ట్రానికి నిధులు తెచ్చుకునే ప్రయత్నం చేశాం. ట్యాక్స్‌ రూపంలో రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళ్లే నిధులు ఎక్కువ.. రాష్ట్రానికి వచ్చేది తక్కువ. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగింది దానిపై భట్టి విక్రమార్క ఒక్క మాట అనలేదు. 8 ప్లస్ 8 16కావాలి...కానీ తెలంగాణలో గుండు సున్నా అయింది. భారత జాతిని సాధుతున్న రాష్ట్రంలో తెలంగాణ టాప్ ఫైవ్‌లో ఉంది. పురావస్తు శాఖలో చరిత్రను తవ్వినట్లు.. గత ప్రభుత్వము అని తవ్వుతూనే ఉన్నారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందని ఒక్కరూ మాట్లాడలేదు. ఒక్క విభజన హామీ నెరవేర్చలేదు.తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు...ఒకరేమో సహాయ మంత్రి, ఇంకొకరు నిస్సహాయమంత్రి. హైదరాబాద్ మెట్రో, అదిలాబాద్ వెనుకబడిన ప్రజలకు ఒక్క రూపాయి ఇవ్వలేదు. ధర్మంతో కూడిన రాజకీయాలు చేయాలి తప్ప.. రాజకీయాల్లోకి ధర్మాన్ని లాగొద్దు. దేశం కోసం ధర్మం కోసం అనే వాళ్ళు వేములవాడ, కొండగట్ట, ధర్మపురి, భద్రాచలం ఆలయాలకు ఒక్క రూపాయి ఇవ్వలేదు. మహాకుంభ మేళాకు కేంద్రం 2100 వంద కోట్లు ఇచ్చింది.వన్ ట్రిలియన్ ఎకానమీ 2030 వరకు ఎలా సాధిస్తారో చెప్పాలి. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కొటేషన్స్‌కు మాత్రమే పరిమితం అయ్యాయి. గత బడ్జెట్‌లో ఇండ్ల లెక్కలు 6లక్షలు అన్నారు.. ఈ సారి 5లక్షలు అంటున్నారు. కేంద్రంతో సఖ్యత అంటున్నారు..మరి ఏం సాధించారో చెప్పాలి. మా ప్రభుత్వం పోగానే ల్యాండ్ క్యూజర్లు కొన్నారని విమర్శలు చేశారు. అప్పటి ప్రభుత్వం కొనుగోలు చేసిన కార్లను ఇప్పుడు సీఎం,మంత్రులు వినియోగిస్తున్నారని’ అన్నారు.

L2: Empuraan Movie Review And Rating In Telugu9
‘ఎల్2: ఎంపురాన్’ మూవీ రివ్యూ

మోహన్‌లాల్‌(mohalal) సినిమాలకు మాలీవుడ్‌లోనే కాదు టాలీవుడ్‌లోనూ మంచి ఆదరణ ఉంటుంది. ఆయన నటించిన చిత్రాలన్నీ తెలుగులోనూ విడుదలై మంచి విజయాన్ని సాధించాయి. ముఖ్యంగా ‘లూసిఫర్‌’ చిత్రం యావత్‌ సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ మూవీకి కొనసాగింపుగా తెరకెక్కిన చిత్రమే ‘ఎల్‌2: ఎంపురాన్‌’ (L2: Empuraan Telugu Movie Review ). పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై ముందు నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తగ్గట్లే దేశ వ్యాప్తంగా ప్రమోషన్స్‌ చేశారు మేకర్స్‌. టాలీవుడ్‌లో దిల్‌ రాజు విడుదల చేస్తుండడంతో ఈ చిత్రానికి తెలుగులో కూడా మంచి బజ్‌ క్రియేట్‌ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(మార్చి 27) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. లూసిఫర్‌ చిత్రం ఎక్కడ ముగిసిందో అక్కడ నుంచి ఈ సినిమా కథ ప్రారంభం అవుతుంది. పీకేఆర్‌ మరణంతో కేరళలో రాజకీయ అలజడి మొదలవ్వడం.. సీఎం సీటు కోసం కుట్రలు చేసిన బాబీ(వివేక్‌ ఒబెరాయ్‌)ని స్టీఫెన్‌ (మోహన్‌లాల్‌) అడ్డుకొని.. పీకేఆర్‌ కొడుకు జతిన్‌ రాందాస్‌(టొవినో థామస్‌)ని రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేస్తాడు. అక్కడితో లూసిఫర్‌ కథ ముగుస్తుంది. సీఎం అయిన తర్వాత జతిన్‌ రాందాస్‌ బుద్ది కూడా మారుతుంది. సొంత ప్రయోజనాల కోసం మతతత్వ వాది బాబా భజరంగి(అభిమన్యు సింగ్‌)తో చేతులు కలిపి ఎల్‌యూఎఫ్‌ పీకేఆర్‌ అని కొత్త పార్టీని స్థాపించి ఎన్నికల్లోకి వెళ్తాడు. ఈ విషయం లండన్‌లో ఉన్న స్టీఫెన్‌(మోహన్‌ లాల్‌)కి తెలుస్తుంది. తన రాష్ట్రాన్ని కబలించడానికి శత్రువులంతా ఏకమై రాజకీయ యుద్ధం చేయడానికి సిద్ధమైతే..స్టీఫెన్‌ దాన్ని ఎలా తిప్పికొట్టాడు? అనేది సినిమా కథ. అసలు స్టీఫెన్‌ నేపథ్యం ఏంటి? ఖురేషీ అబ్రాన్‌గా పేరు మార్చుకొని విదేశాల్లో ఏం చేస్తున్నాడు? అతని కోసం ఇతర దేశాల గుఢాచార సంస్థలు ఎందుకు వెతుకుతున్నాయి. జతిన్‌ కొత్త పార్టీని స్థాపించిన తర్వాత పీకేఆర్‌ కూతురు ప్రియ(మంజు వారియర్‌) ఎలాంటి నిర్ణయం తీసుకుంది? బల్రాజ్‌ పటేల్‌ కాస్త బాబా భజరంగిగా ఎలా మారాడు? భజరంగికి జయేద్‌ మసూద్‌(పృథ్విరాజ్‌ సుకుమార్‌) మధ్య ఉన్న శత్రుత్వం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే(L2: Empuraan Movie Review ) ఎలా ఉందంటే..ఆరేళ్ల క్రితం వచ్చిన లూసిఫర్‌ చిత్రంలో మోహన్‌లాల్‌ని డిఫరెంట్‌గా చూపించడంతో పాటు పొలిటికల్‌ డ్రామాను బాగా పండించాడు దర్శకుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌. హీరోకి ఇచ్చిన ఎలివేషన్స్‌, మధ్య మధ్యలో వచ్చే ట్విస్టులు సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. సీక్వెల్‌కి కూడా అదే ఫాలో అయ్యాడు. హీరోతో పాటు ప్రతి పాత్రకు భారీ ఎలివేషన్స్‌ ఇచ్చాడు.కథ-కథనాన్ని కూడా బాగానే రాసుకున్నాడు. కానీ కథ కంటే ఎక్కువ ఎలివేషన్స్‌పైనే దృష్టిపెట్టాడు. మోహల్‌లాల్‌ వచ్చే ప్రతి సీన్‌కి ఎలివేషన్‌ పెట్టడం కొన్నిచోట్ల అతిగా అనిపిస్తుంది. అలాగే సినిమాలోని ప్రతి పాతకు ఓ ప్లాష్‌బ్యాక్‌ స్టోరీ చూపించడంతో కథనం సాగదీసినట్లుగా సాగుతుంది. సీన్ల పరంగా చూస్తే మాత్రం సినిమా అదిరిపోతుంది. ప్రతి ఐదు పది నిమిషాలకు గూస్‌బంప్స్‌ తెప్పించే సన్నివేశం ఉంటుంది. సినిమా ప్రారంభమైన యాభై నిమిషాల వరకు మోహన్‌లాల్‌ తెరపై కనిపించడు. ఆయన వచ్చి ఈ రాజకీయ అలజడిని ఎలా అడ్డుకుంటాడో అనేలా కథనాన్ని నడిపించి.. ఆయన ఎంట్రీ కోసం ఎదురు చూసేలా చేశారు. ప్రేక్షకుడు ఎదురుచూపులకు ఏ మాత్రం నిరాశ కలగకుండా ఎంట్రీ సీన్‌ ఉంటుంది. హీరో విదేశాల్లో ఉన్నప్పుడు వచ్చే యాక్షన్‌ సీన్లు హాలీవుడ్‌ సినిమాలను గుర్తు చేస్తాయి. ఆయా సన్నివేశాలను స్టైలీష్‌గా తీర్చి దిద్దారు. ఇంటర్వెల్‌ ట్విస్ట్‌ సెకండాఫ్‌పై ఆసక్తిని కలిగిస్తుంది. ఇక ద్వితియార్థం మొత్తం కేరళ రాజకీయాల చుట్టే జరుగుతుంది. అయితే సినిమాల్లో చాలా లేయర్లు ఉండడం.. పార్ట్‌ 3 కోసమే అన్నట్లుగా కొన్ని సన్నివేశాలు పెట్టడం ఆడియెన్స్ ని డీవియేట్‌ చేస్తుంది. ఇక సినిమాకి మరో ప్రధాన మైనస్‌ ఎంటంటే.. డైలాగులు. ఈ సినిమాలోని డైలాగులలో ఎక్కువగా ఓ మతం ప్రజలు వాడే పదాలే ఎక్కువగా కలిపిస్తాయి . డబ్బింగ్‌ విషయంలో జాగ్రత్త పడాల్సింది. తెలుగు నేటివిటికి తగ్గట్లుగా మార్పులు చేస్తే బాగుండేది. క్లైమాక్స్‌లో మోహల్‌ లాల్‌, పృథ్విరాజ్‌ కలిసి చేసే ఫైటింగ్‌ సీన్‌ ఫ్యాన్స్‌ని ఈలలు వేయిస్తుంది. పార్ట్‌ 3పై ఆసక్తిని పెంచేలా ముగింపు ఉంటుంది. స్టీఫెన్‌ అలియాస్‌ ఖురేషీ అబ్రాన్‌ నేపథ్యం పూర్తిగా తెలియాలంటే ‘ఎల్‌ 3’ కోసం ఎదురు చూడాల్సిందే. ఎవరెలా చేశారంటే.. మోహన్‌లాల్‌ యాక్టింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.దేశం గర్వించదగ్గ గొప్ప నటుల్లో ఆయన ఒకరు. ఎలాంటి పాత్రలో అయినా పరకాయ ప్రవేశం చేస్తాడు. ‘ఎల్‌2:ఎంపురాన్‌’లో స్టీఫెన్‌గా, ఖురేషి అబ్రాన్‌గా రెండు పాత్రల్లో కనిపించి ఆకట్టుకున్నాడు. ఫ్యాన్స్‌ సినిమా చూడడానికి ఆయన ఎంట్రీ సీన్‌ ఒకటి చాలు. తెరపై ఆయన కనిపించిన ప్రతిసారి ఫ్యాన్స్‌కి పునకాలే. సీఎం జతిన్‌ రాందాస్‌గా టోవినో థామస్‌ సెటిల్డ్ యాక్టింగ్‌తో మెప్పించారు. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ తెరపై కనిపించేది కాసేపే అయినా.. తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఆయన పాత్ర కోసం రాసుకున్న సన్నివేశాలే సినిమాకు కీలకం. మంజు వారియర్‌ మరోసారి తెరపై తన అనుభవాన్ని చూపించింది. పొలిటికల్‌ లీడర్‌గా ఆమె బాగా నటించారు. సెకండాఫ్‌లో ఆమె పాత్ర ఇచ్చే ట్విస్ట్‌ ఆకట్టుకుంటుంది. ఇక విలన్‌ బాబా భజరంగీ అలియాస్‌ బల్రాజు పటేల్‌గా అభిమన్యు సింగ్‌ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. మిగతావారంతా తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. యాక్షన్‌ కొరియోగ్రఫీ సినిమా స్థాయిని పెంచేసింది. హాలీవుడ్‌ మూవీ స్థాయిలో యాక్షన్‌ సీన్లను తీర్చిదిద్దారు. సుజిత్ వాసుదేవ్ సినిమాటోగ్రఫీ అదిరిపోయింది. ప్రతి సీన్‌ని తెరపై చాలా రిచ్‌గా చూపించాడు. దీపక్ దేవ్ నేపథ్య సంగీతం ఈ సినిమాకు మరో ప్లస్‌ పాయింట్‌. ఎడిటర్‌ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. ఫస్టాఫ్‌లో కొన్ని సన్నివేశాలను ఇంకాస్త క్రిస్పీగా కట్‌ చేసి, నిడివిని తగ్గిస్తే బాగుండేదేమో. లైకా ప్రొడక్షన్స్, ఆశీర్వాద్ పిక్చర్స్, శ్రీ గోకులం మూవీస్ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

Remarks on Shinde Row: Kunal Kamra Request Rejected By Mumbai Cops10
కునాల్‌ కమ్రాకు ముంబై పోలీసుల ఝలక్‌

ముంబై: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్‌ షిండే(Eknath Shinde)పై పేరడీ పేరిట కామెంట్లు చేసిన కేసులో స్టాండప్‌ కమెడియన్‌ కునాల్‌ కమ్రాకు ముంబై పోలీసులు ఝలక్‌ ఇచ్చారు. తనకు ప్రాణహాని ఉందని.. విచారణకు హాజరయ్యేందుకు కాస్త గడువు ఇవ్వాలని కునాల్‌ చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చారు.షిండే పరువుకు భంగం కలిగించారనే ప్రధాన అభియోగంతో పాటు మరికొన్నింటిని కమ్రాపై ముంబై పోలీసులు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించిన మార్చి 31వ తేదీన తమ ఎదుట హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. అయితే.. ఒకవైపు ముందస్తు బెయిల్‌ ప్రయత్నాల్లో ఉన్న కునాల్‌ కమ్రా(Kunal Kamra).. మరోవైపు తనకు ప్రాణహాని ఉందని పేర్కొంటూ గడువు పొడిగింపు కోరాడు. ఏప్రిల్‌ 3వ తేదీన విచారణకు హాజరవుతానని విజ్ఞప్తి చేశాడు. కానీ, పోలీసులు అందుకు అంగీకరించలేదు.ముంబైలోని హాబిటాట్ స్టూడియో(Habitat Studio)లో జరిగిన ఈవెంట్‌లో కునాల్‌ కమ్రా ప్రదర్శన ఇచ్చాడు. ఈ క్రమంలో ఏక్‌నాథ్‌ షిండేను ద్రోహిగా వర్ణించడంతో షిండే శివసేన యువ విభాగం భగ్గుమంది. కునాల్‌కు ఫోన్లు చేసి బెదిరింపులకు దిగింది. అదే టైంలో.. హాబిటాట్‌ స్టూడియోపై దాడికి దిగి విధ్వంసానికి పాల్పడింది. ఈ కేసులో 12 మందిని పోలీసులు అరెస్ట్‌ చేయగా.. వెంటనే బెయిల్‌ లభించింది.షిండేపై కునాల్‌ వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌తో సహా కూటమి ప్రభుత్వ నేతలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేయగా.. థాక్రే శివసేన, ఎస్పీ పార్టీలు కునాల్‌కు మద్ధతుగా నిలిచాయి. షిండేకు క్షమాపణలు చెప్పాలంటూ సీఎం ఫడ్నవిస్‌ కోరగా.. అందుకు కునాల్‌ నిరాకరించాడు. కోర్టు కోరితేనే క్షమాపణలు చెబుతానంటూ తెగేసి చెప్పాడు. మరోవైపు కునాల్‌ వ్యంగ్యాన్ని తాను అర్థం చేసుకోగలనంటూనే.. దేనికైనా పరిమితి ఉంటుందంటూ షిండే మండిపడ్డారు. అదే టైంలో స్టూడియోపై తన పార్టీ విభాగం జరిపిన దాడిని ఖండిస్తూ.. చర్యకు ప్రతిచర్య ఉంటుందనే విషయం గుర్తుంచుకోవాలని చెప్పారు.ఈలోపు.. శివసేన(షిండే) ఎమ్మెల్యే ముర్జి పటేల్‌ ఫిర్యాదుతో మంబై పోలీసులు కునాల్‌ కమ్రాపై కేసు నమోదు చేసి విచారణకు రావాలంటూ నోటీసులు పంపించారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement