
సినిమా ఇండస్ట్రీలో డేటింగ్ అనేది సర్వసాధారణం. నచ్చిన వ్యక్తి దొరికితే కొన్నాళ్లు అతనితో కలిసి తిరుగుతారు, నచ్చితే పెళ్లి వరకు వెళ్తారు. లేదంటే ఒకరికొకరు గుడ్ బై చెప్పుకొని విడిపోతారు. చాలా మంది హీరోయిన్లు ఇప్పుడు డేటింగ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని కొంతమంది బహిరంగంగానే చెప్పేస్తారు కూడా. అయితే ఈ డేటింగ్‌పై ఒక్కో హీరోయిన్‌కి ఒక్కో అభిప్రాయం ఉంటుంది. తాజాగా డేటింగ్ హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్ తన అభిప్రాయాన్ని చెప్పింది.
డేటింగ్ చేస్తే..మొదటి రోజే లిప్‌కిస్ పెడతారా అనే ప్రశ్నకు ప్రగ్యా.. నో చెప్పింది. మొదటి రోజు ముద్దు పెట్టే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టింది. అలా అని లిప్‌కిస్ పెట్టకుండా ఉంటుందా అంటే.. అదీ కాదట. కొన్ని రోజులు కలిసి జీవించి, మనసు మనసు కలిసిన తర్వాత లిప్‌కిస్‌కి ఓకే చెబుతుందట. మరి ప్రస్తుతం ఎవరితోనైనా డేటింగ్ చేస్తున్నారా అంటే.. అబ్బే.. అంత టైం లేదండి అని సింపుల్‌గా చెప్పేసింది ఈ పొడుగు కాళ్ల సుందరి. ప్రస్తుతం ఈ బ్యూటీ బాలకృష్ణ‘అఖండ’లో నటిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment