
బెంగళూరు : సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ నిర్మాత కందేపి సత్యనారాయణ ఆదివారం రాత్రి కన్నుమూశారు. ప్రస్తుతం బెంగళూరులో నివాసం ఉంటున్న ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన రాత్రి 9 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు.(మరోసారి నా హృదయం ముక్కలైంది: కృతి సనన్)
సత్యనారాయణ మృతి పట్ల పలువురు తెలుగు, తమిళ సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. కాగా, ‘పాండురంగ మహాత్మ్యం’ అనే డబ్బింగ్ సినిమా ఆయన తొలి చిత్రం. అనంతరం కొంగుముడి, దొరగారింట్లో దొంగోడు, శ్రీవారు వంటి తెలుగు సినిమాలతో పాటు తమిళంలో కూడా ఆయన పలు చిత్రాలను నిర్మించారు. మొత్తంగా 40 చిత్రాలకు పైగా ఆయన నిర్మాతగా వ్యవహరించారు.(ఎల్లుండి కేజీఎఫ్ 2 నుంచి సర్‌ప్రైజ్)
Comments
Please login to add a commentAdd a comment