నేడు మీడియా ముందుకు 'పుష్ప2' యూనిట్‌ | Pushpa 2 Movie Makers Grand National Press Meet On October 24th, Interesting Deets Inside | Sakshi
Sakshi News home page

Pushpa 2 Press Meet Today: నేడు మీడియా ముందుకు 'పుష్ప2' యూనిట్‌

Published Thu, Oct 24 2024 7:45 AM | Last Updated on Thu, Oct 24 2024 10:25 AM

Pushpa 2 Movie Makers National Press Meet October 24th

 ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌  'పుష్ప2: ది రూల్‌' పాన్‌ ఇండియా రేంజ్‌లో ప్రమోషన్స్‌ మొదలు కానున్నాయి. మరో 45 రోజుల్లో ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద పుష్పగాడి రూలింగ్‌ ప్రారంభం కానుంది. దీంతో నేడు (అక్టోబర్‌ 24న) నేషన్‌ల్‌ స్థాయిలో ఒక ప్రెస్‌మీట్‌ నిర్వహిస్తున్నట్లు మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు.  సుకుమార్‌ దర్శకత్వంలో వచ్చిన 'పుష్ప: ది రైజ్'కు కొనసాగింపుగా తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబరు 6న విడుదల కానుంది.

అక్టోబర్‌ 24న మధ్యాహ్నం 12 గంటలకు పుష్ప2 చిత్ర నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు పాన్‌ ఇండియా స్థాయిలో మీడియాతో ప్రెస్‌మీట్‌ నిర్వహిస్తున్నారు. ఈమేరకు గ్రాండ్‌ నేషనల్‌ ప్రెస్‌మీట్‌ నిర్వహిస్తున్నామని మేకర్స్‌ ఒక పోస్టర్‌ను కూడా రిలీజ్‌ చేశారు.   అల్లు అర్జున్,  సుకుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారా అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు.  పుష్ప2 చిత్రాన్ని డిసెంబర్ 5వ తేదీనే రిలీజ్ చేయాలని భావిస్తున్నట్టు ఇండస్ట్రీలో ప్రచారం జరిగింది. నేడు ఈ విషయంపై మేకర్స్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.

పుష్ప 2 సినిమాకు ఏకంగా రూ.1000 కోట్ల  ప్రీ-రిలీజ్ బిజినెస్ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. థియేట్రికల్ హక్కులు, ఓటీటీ రైట్స్, ఆడియో, శాటిలైట్ కలిపి ఈ మార్క్‌ బిజినెస్‌ జరగడం ఇండియన్‌ సినిమా చరిత్రలో ఇదే తొలిసారని చెప్పవచ్చు.

'పుష్ప2' ఫస్ట్‌ హాఫ్ చూశానని చెప్పిన సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌ ఫస్ట్‌ రివ్యూ ఇచ్చేశాడు. సినిమాపై భారీ అంచనాలు పెంచేశాడు. 'పుష్పరాజ్‌'గా అల్లు అర్జున్‌ క్యారెక్టర్‌ పార్ట్‌2లో మరింత బలంగా ఉండనుందని తెలుస్తోంది. మరోవైపు రష్మిక మందన్న పాత్ర కూడా అంతే స్థాయిలో ఉండొచ్చని సమాచారం. ఇప్పటికే పుష్ప2 నుంచి విడుదలైన ప్రచార పోస్టర్స్‌, సాంగ్స్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement