ఫైట్‌ మాస్టర్ల దర్శకత్వంలో లారెన్స్‌ మూవీ | Raghava Lawrence Announce His Next Movie Durga In Fight Masters Direction | Sakshi
Sakshi News home page

Raghava Lawrence: ఫైట్‌ మాస్టర్ల దర్శకత్వంలో లారెన్స్‌ మూవీ

Published Thu, Jan 6 2022 8:07 AM | Last Updated on Thu, Jan 6 2022 8:09 AM

Raghava Lawrence Announce His Next Movie Durga In Fight Masters Direction - Sakshi

సాక్షి, చెన్నై: కాంచనాతో కథానాయకుడిగా మంచి విజయం సాధించిన రాఘవ లారెన్స్‌ తాజాగా దుర్గ అనే చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. తన సొంత నిర్మాణ సంస్థ శ్రీ రాఘవేంద్ర ప్రొడక్షన్స్‌ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ విషయాన్ని బుధవారం అధికారికంగా మీడియాకు తెలియజేశారు. ఈ చిత్రం ద్వారా యువ ఫైట్‌ మాస్టర్లు ధ్వయం, అన్బరివ్‌లు దర్శకులుగా పరిచయమవుతుండడం విశేషం. కాగా ఇంతకుముందు కొందరు స్టంట్‌ మాస్టర్‌లు దర్శకుడిగా పరిచయమైనా పెద్దగా సక్సెస్‌ కాలేదు. మరి ఈ జంట ఏ మేరకు సక్సెస్‌ అవుతారో అన్న ఆసక్తి  కోలివుడ్‌లో నెలకొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement