బీ టౌన్ కొత్త జంట రాజ్ కుమార్ రావు, పత్రలేఖ వివాహం నవంబర్ 15న జరిగిన సంగతి తెలిసిందే. ఈ వివాహ వేడుకలోని కొన్ని మధురమైన క్షణాలను పంచుకున్నారు రాజ్ కుమార్. దీనికి సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టా గ్రామ్‌లో షేర్ చేశారు. 'మా జీవితంలోని అత్యంత అందమైన రోజును మీ అందరితో పంచుకుంటున్నాను.' అంటూ రాజ్ కుమార్ చెప్పడంతో వీడియో ప్రారంభమవుతుంది. 'ఇదంతా 11 సంవత్సరాలైంది. కానీ నువు నాకు నా జీవితకాలం నుంచి తెలిసినట్టు అనిపిస‍్తుంది. ఈ ఒక్క జన్మే కాదు అనేక జన్మల నుంచి అని అనుకుంటున్నాను.' అంటూ పత‍్రలేఖకు రాజ్ కుమార్ చెప్తాడు.
మరోవైపు వీడియో రాజ్ వాయిస్ ఓవర్‌లో 'నిజంగా చెప్పాలంటే 10-11 ఏళ్లు గడిచాయి. కానీ మేము ఇప్పుడే డేటింగ్ ప్రారంభించినట్లు అనిపిస్తుంది. మేము ఒకరి సాంగత్యాన్ని ఒకరం చాలా ప్రేమిస్తున్నాం. భార్యాభర్తల్లాగా అలాగే చేద్దామనుకుంటున్నాం.' అని అన్నాడు. అలాగే పత్రలేఖ నుదిటిపై రాజ్ కుమార్ సింధూరం పెట్టి, తనకు కూడా అలాగే పెట్టమంటాడు. ఇది వారి సాంప్రదాయంలో భాగమట. సాధారణంగా భార్య నుదిటిపై సింధూరం పురుషులు మాత్రమే పెడతారు.
చదవండి: బాలీవుడ్ కొత్త జంట వివాహ వేదిక గురించి ఆసక్తికర విషయాలు తెలుసా ?
Comments
Please login to add a commentAdd a comment