
Rakul Preet Singh: ఇండస్ట్రీలో ఇన్‌సైడర్ అండ్ అవుట్‌సైడర్ అనే విషయాన్ని ఏ మాత్రం నమ్మనంటున్నారు రకుల్‌ప్రీత్ సింగ్. ఈ విషయంపై మాట్లాడుతూ – ‘‘ఇండస్ట్రీలో బయటినుంచి వచ్చేవాళ్లు, బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవాళ్లు అనే కాన్సెప్ట్ ఎప్పుడూ వినబడుతూనే ఉంటుంది. అయితే ప్రతిభావంతులు మాత్రమే ఇక్కడ రాణించగలరు. బ్యాక్‌గ్రౌండ్ ఉంటే కొన్ని అవకాశాలు వస్తాయి. కానీ ఇండస్ట్రీలో నిలదొక్కుని ఎక్కువకాలం రాణించగలగడం మాత్రం ప్రతిభపైనే ఆధారపడి ఉంటుంది. ఆ ప్రతిభావంతులను ప్రేక్షకులే నిర్ణయిస్తారు. వారికే పట్టం కడతారు’’ అన్నారు.
ఇంకా మాట్లాడుతూ– ‘‘తెలుగు సినిమా, హిందీ సినిమా అంటూ భాషపరమైన హద్దులు పెట్టుకోలేదు. నచ్చిన కథ దొరికితే ఒప్పుకుంటున్నాను’’ అన్నారు. ప్రస్తుతం హిందీలో ‘మే డే’, ‘థ్యాంక్ గాడ్’, ‘ఎటాక్’, ‘డాక్టర్ జీ’ చిత్రాలతో పాటు సౌత్‌లో మూడు చిత్రాలు చేస్తున్నారు రకుల్.
చదవండి:
60కి పైగా యాడ్స్‌లో నటించిన ఈ భామను గుర్తుపట్టారా?
Comments
Please login to add a commentAdd a comment