
∙రామసత్యనారాయణ, రామ్‌గోపాల్ వర్మ
‘ఐస్‌క్రీమ్, ఐస్‌క్రీమ్ 2’ వంటి చిత్రాల తర్వాత రామ్‌గోపాల్ వర్మ- తుమ్మలపల్లి రామసత్యనారాయణ కాంబినేషన్‌లో ముచ్చటగా మూడో సినిమా ప్రకటన వచ్చింది. 2014 జూలై 14న ‘ఐస్‌క్రీమ్’ సినిమా విడుదలైంది. ఈ చిత్రం విడుదలై ఏడేళ్లయిన సందర్భంగా రామ్‌గోపాల్ వర్మ, తన కాంబినేషన్‌లో మూడో సినిమాను ప్రకటించారు రామసత్యనారాయణ.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఐస్‌క్రీమ్’ చిత్రం నిర్మాతగా నా స్థాయిని పెంచడంతోపాటు నా జాతకాన్ని కూడా మార్చింది. అతి త్వరలో ఆర్జీవీ దర్శకత్వంలో మూడో సినిమా నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నాను. ఆర్జీవీ నాపై చూపించే అభిమానానికి ఎప్పటికీ రుణపడి ఉంటాను’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment