tummalapalli rama satyanarayana
-
ఐస్‌క్రీమ్ 3: ఆర్జీవీకి ఎప్పటికీ రుణపడి ఉంటాను
‘ఐస్‌క్రీమ్, ఐస్‌క్రీమ్ 2’ వంటి చిత్రాల తర్వాత రామ్‌గోపాల్ వర్మ- తుమ్మలపల్లి రామసత్యనారాయణ కాంబినేషన్లో ముచ్చటగా మూడో సినిమా ప్రకటన వచ్చింది. 2014 జూలై 14న ‘ఐస్‌క్రీమ్’ సినిమా విడుదలైంది. ఈ చిత్రం విడుదలై ఏడేళ్లయిన సందర్భంగా రామ్‌గోపాల్ వర్మ, తన కాంబినేషన్లో మూడో సినిమాను ప్రకటించారు రామసత్యనారాయణ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఐస్‌క్రీమ్’ చిత్రం నిర్మాతగా నా స్థాయిని పెంచడంతోపాటు నా జాతకాన్ని కూడా మార్చింది. అతి త్వరలో ఆర్జీవీ దర్శకత్వంలో మూడో సినిమా నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నాను. ఆర్జీవీ నాపై చూపించే అభిమానానికి ఎప్పటికీ రుణపడి ఉంటాను’’ అన్నారు. -
పెద్ద బడ్జెట్ సినిమా తీయను
‘‘జీవితంలో ఎప్పుడూ పెద్ద బడ్జెట్ సినిమా తీసే ఆలోచన లేదు. నా తుది శ్వాస వరకు చిన్న బడ్జెట్ సినిమాలు తీస్తూనే ఉంటాను’’ అని నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ అన్నారు. నేడు ఆయన 63వ పుట్టినరోజు. ఈ సందర్భంగా రామ సత్యనారాయణ మాట్లాడుతూ– ‘‘2004లో నేను మొదటి సినిమా తీశాను. ఇప్పటికి 98 సినిమాలు పూర్తి చేశాను. 99వ చిత్రం రామ్‌గోపాల్ వర్మతో ఉంటుంది. నూరవ చిత్రానికి దర్శకత్వం వహిస్తానని ఒక శతాధిక దర్శకుడు మాట ఇచ్చారు. 101వ సినిమాగా ‘అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి’ అనే సినిమా స్టార్ట్ చేస్తాను. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావుగారి శిష్యుడు ఉదయభాస్కర్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రానికి జేకే భారవి స్క్రిప్ట్ అందిస్తున్నారు. ఈ కరోనా ప్రభావం తగ్గాక 102వ చిత్రం ఉంటుంది. దీనికి సాయి ప్రకాష్‌గారు దర్శకుడు. చిన్న సినిమాలకు ఓటీటీ/ఏటీటీలే మార్గం. పెద్ద సినిమాలు థియేటర్లో చూస్తే ఆ థ్రిల్, ఆ అనుభూతి బాగుంటుంది’’ అన్నారు. -
చిన్న చిత్రాలకు శాశ్వత పరిష్కారం
ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్ హవా కొనసాగుతోంది. ప్రేక్షకులు కూడా ఓటీటీలో సినిమాలు చూసేందుకు ఆసక్తి చూపుతుండటంతో పలువురు ఈ ప్లాట్ఫామ్లోకి వస్తున్నారు. తాజాగా నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ కూడా ఓటీటీ ప్లాట్ఫామ్లోకి వస్తున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘మా ‘భీమవరం టాకీస్’ పేరుతో ఒక ఓటీటీ యాప్‌ని తీసుకొస్తున్నాం. అంతేకాదు.. మారుతున్న టెక్నాలజీతో మనం మారుదామంటూ సినిమా జీనియస్ రామ్‌గోపాల్ వర్మ ఏటీటీ (ఎనీ టైమ్ థియేటర్) అనే సరికొత్త మార్గాన్ని వెలికితీశారు. ఈ రంగంలోకి కూడా భీమవరం టాకీస్ అడుగుపెడుతోంది. ఏటీటీ వల్ల చిన్న సినిమా విడుదల సమస్యలకు శాశ్వతంగా పరిష్కారం దొరుకుతుంది. చిన్న బడ్జెట్ నిర్మాతల కోసం నిర్మాతల మండలి కూడా ఇలాంటి ఓటీటీ యాప్‌ని త్వరలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది’’ అన్నారు. -
థ్రిల్ చేస్తుంది
సాగర్ శైలేష్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘రహస్యం’. శ్రీ రితిక కథానాయికగా. ‘జబర్దస్త్’ అప్పారావు ముఖ్య పాత్ర చేశారు. భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా రామసత్యనారాయణ మాట్లాడుతూ– ‘‘చిన్న బడ్జెట్ చిత్రాలకు ప్రేక్షకుల ఆదరణ లేదని, థియేటర్లు దొరకటం లేదని అంటుంటారు. ఇందులో కొంత వాస్తవం ఉన్నా పూర్తిగా కాదు. చిన్న సినిమాల్లో ఎన్నో చిత్రాలు బాగా ఆడుతున్నాయి. మంచి చిత్రాలకు థియేటర్స్ దొరుకుతున్నాయి. అందుకు నేను నిర్మించిన చిన్న చిత్రాలే ఉదాహరణ. కొత్త తరహా కథాంశంతో, థ్రిల్లింగ్ అంశాలతో రూపొందిన చిత్రమిది. సాగర్ హీరోగానే కాకుండా దర్శకుడిగా కూడా చక్కని ప్రతిభ కనబర్చారు. ఇటీవల విడుదల చేసిన పాటలకు, టీజర్లకు స్పందన బాగుంది’’ అన్నారు. -
ధన్‌రాజ్ నమ్మిన కథ
‘‘నేను 70 సినిమాల్లో కష్టపడి సంపాదించిందంతా పెట్టుబడిగా పెట్టి ఈ సినిమా స్టార్ట్ చేశా. తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. నేను నమ్మిన కథ ఇది’’ అని నటుడు ధన్‌రాజ్ చెప్పారు. సాయి అచ్యుత్ చిన్నారి దర్శకత్వంలో మాస్టర్ సుక్కురామ్ సమర్పణలో తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మించిన ఈ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని కొడాలి వెంకటేశ్వరరావు, మనోజ్ నందం, అనిల్ కల్యాణ్, శ్రీముఖి తదితరులు ఆకాంక్షించారు. -
ఓబుల్‌రెడ్డికి ఎలా స్పాట్ పెట్టారు?
‘రక్తచరిత్ర’ వెనుక ఉన్న అసలు చరిత్ర ఏంటి? ఓబుల్‌రెడ్డికి ఎలా స్పాట్ పెట్టారు? తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయ్? ఈ ప్రశ్నలకు సమాధానంగా రామ్‌గోపాల్‌వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం ‘స్పాట్’. తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ మూడో షెడ్యూల్‌కి చేరుకుంది. ఫ్యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు నిర్మాత తెలిపారు.