టాలీవుడ్ హీరో సాయి ధరమ్ తేజ్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. సినిమాలు, వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటారు. ఈ క్రమంలో మెగా మేనల్లుడు చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఓ చిన్న ప్రాణి తన ప్రయత్నంతో ఎలా విజయాన్ని సాధించగలిగించిందన్న వీడియోను శనివారం తన ట్విటర్‌లో పోస్ట్ చేశారు.‘ ఎక్కడైతే సంకల్పం ఉంటుందో అక్కడ విజయానికి దారి ఉంటుంది’ అని పేర్కొన్న ఈ పోస్టును సాయి ధరమ్ తేజ్ రీట్వీట్ చేశారు. ముందుగా వండర్ ఆఫ్ సైన్స్ ఈ వీడియోను షేర్ చేసింది. పరిమాణంతో సంబంధం లేకుండా ప్రతి చిన్న జీవి నుంచి కూడా మన నేర్చుకోవచ్చు అనే క్యాప్షన్‌తో తన ట్విటర్ అకౌంట్లో షేర్ చేశారు. (సుకుమార్ స్క్రీన్‌ప్లేతో..)
ఈ వీడియోలో ఒక చిన్న అంగుళాల పురుగు ఓ బల్ల మీద నుంచి మరో బల్ల మీదకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుంది. అయితే రెండు బల్లల మధ్యలో దాని పరిమాణం అంతే ఉన్న ఖాళీ ప్రదేశాన్ని దాటేందుకు ఎలా కృషి చేసిందో ఈ వీడియోలో తెలుస్తోంది. కాగా దీనిపై అభిమానులు భారీగా స్పందిస్తున్నారు. ‘మెగా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ తమ కెరీర్‌లో ఎదిగేందుకు ఇది ప్రధాన కారణం’ అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. ‘మంచి విషయాలను ఎవరి నుంచి అయినా నేర్చుకోవచ్చు’. అని మరో నెటిజన్ పేర్కొన్నారు. (నా విజయం వాయిదా పడిందనుకున్నా!)
Something that we can learn today from a little #inchworm ☺️☺️☺️ https://t.co/CNrr6mlQsH
— Sai Dharam Tej (@IamSaiDharamTej) August 21, 2020
ఇక సినిమాల విషయానికొస్తే ధరమ్ తేజ్ వరస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే తను నటించిన సోలో బ్రతుకే సో బెటరూ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. కొత్త దర్శకుడు సుబ్బు దీన్ని తెరకెక్కించాడు. అలాగే దేవా కట్టాతో మరో సినిమా చేయనున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల ధరమ్ తేజ్ ఓ కొత్త సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే. సుకుమార్ వద్ద రచన శాఖలో పనిచేసిన కార్తీక్ దండు ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. (భగవద్గీత సాక్షిగా..!)
Comments
Please login to add a commentAdd a comment