సాయిపల్లవి ఇంట పెళ్లి సందడి.. డ్యాన్స్‌ వీడియో వైరల్‌ | Sai Pallavi Sister Pooja Kannan Marriage Inside Photos And Videos Trending On Social Media | Sakshi
Sakshi News home page

సాయిపల్లవి ఇంట పెళ్లి సందడి.. డ్యాన్స్‌ వీడియో వైరల్‌

Published Thu, Sep 5 2024 5:34 PM | Last Updated on Thu, Sep 5 2024 5:53 PM

Sai Pallavi Sister Marriage Photos And Videos Viral

నటి సాయిపల్లవి సోదరి పూజా కన్నన్ వివాహం చాలా ఘనంగా జరిగింది. తమ ఇంట్లో శుభకార్యం కావడంతో సాయిపల్లవి కుటుంబసభ్యులు ఎంతో సందడిగా గడిపారు. పూజా కన్నన్‌ తన క్లోజ్‌ ఫ్రెండ్‌ వినీత్‌తో ఏడడుగులు వేశారు. ఈ వేడుకల్లో తన సోదరితో కలిసి సాయిపల్లవి డ్యాన్‌ వేసింది.  అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

యిపల్లవి సోదరి పూజా కన్నన్‌ కూడా చిత్రపరిశ్రమలో ఉన్నారనే విషయం తెలిసిందే. 2021లో  కోలీవుడ్‌ చిత్రం ‘చితిరై సెవ్వానం’తో నటిగా ఆమె ఎంట్రీ ఇచ్చారు. అయితే, ఈ చిత్రం తర్వాత ఆమె సినిమాల్లో నటించలేదు. వినీత్‌, పూజా ఇద్దరూ ఇరు కుటుంబాలను ఒప్పించి  ఈ ఏడాది జనవరిలో  నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా వారిద్దరూ ఏడడుగుల బంధంలో అడుగుపెట్టారు. దీంతో సాయిపల్లవి అభిమానులు పూజా కన్నన్‌ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement