టాలీవుడ్ స్టార్ కపుల్ సమంత-నాగచైతన్యలు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎప్పుటికప్పుడు ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు సమంత. కానీ చైతు అలా కాదు సోషల్ మీడియాకు ఆమడ దూరం ఉంటాడు. ఎదో అప్పుడప్పుడు ఓ పోస్టు షేర్ చేసి అభిమానులను ఆశ్చర్యపరుస్తుంటాడు. సమంత ఎప్పుడు లైమ్ లైట్‌లో ఉండేందుకు ఇష్టపడితే.. చైతూ మాత్రం తన ప్రపంచలోనే ఉంటాడని వారి సన్నిహితులు అంటుంటారు.
అయితే ఈ జంటకు వారి పెంపుడు కుక్క హష్ అంటే విపరీతమైన ప్రేమ. హష్‌ను తమ బిడ్డలా చూసుకుంటారు చై-సామ్. హష్ చేసే అల్లరి, ఇంట్లో తనకు ఎలా సాయంగా ఉంటుందో తరచూ సామ్ పోస్టు చేస్తూనే ఉంటుంది. అంతేకాదు దాని కోసం సామ్, చైతో తరచూ చిన్నపాటి ఘర్షణ కూడా పడుతుందట. అయితే ఇటీవల ఆహాలో ప్రసారమైన సామ్ జామ్ షో చివరి ఎపిసోడ్‌కు నాగ చైతన్య గెస్ట్‌గా వచ్చిన విషయం తెలిసిందే. ఈ షోలోనే హష్ గురించి వీరిద్దరు వాదించుకున్నారు. హష్‌కు ఎవరంటే అంటే ఇష్టం నేనే కదా... వాడు ఎప్పుడు నా చూట్టే తిరుగుతాడు అంటూ సామ్, చైతో చిన్నపాటి వాగ్వాదానికి దిగగా.. వాడు నీ చూట్టు తిరిగిన నాతోనే ఉంటాడు.. నేను అంటేనే ఇష్టమని నాగ చైతన్య అంటాడు.
అలా హష్ గురించి వీరిద్దరూ షోలో చర్చించుకున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల మరోసారి హష్ విషయంలో వీరిద్దరికి చిన్నపాటి ఘర్షణ అయినట్లు సమంత సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. తన డైజైనర్ ఫ్రెండ్ క్రిష్ బజాజ్ జవేరి ఇటీవల అచ్చం హష్ లాంటి బొమ్మను చై-సామ్‌లకు బహుమతిగా ఇచ్చాడట. ఆ గిఫ్ట్ తనకు బాగా నచ్చిందని, తన జీవితంలో ఇదే గొప్ప బహుమతి అని కూడా చెప్పారు. అయితే ఈ విషయంలో చైతన్య తనకు సమస్య వచ్చి పడిందని, ఈ బొమ్మ ఎవరికి సొంతమనే విషయంలో వారిద్దరి మధ్య చిన్నపాటి వాదన జరిగినట్లు సమంత చెప్పుకొచ్చారు. అయితే చివరి హష్ బొమ్మ వారిద్దరి సొంతమైందని కూడా తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment