టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తండ్రి జోసెఫ్ ప్రభు కొంత సమయం క్రితం కన్నుమూశారు. సోషల్‌మీడియా ద్వారా సమంత ఈ విషయాన్నితెలిపారు. మళ్లీ మిమ్మల్ని కలిసేంత వరకు.. సెలవు నాన్న అంటూ ఆమె ఒక పోస్ట్ పెట్టారు. అయితే, ఆయన మరణానికి సంబంధించిన వివరాలు ఆమె వెళ్లడించలేదు. కానీ, అనారోగ్య సమస్యల వల్ల చెన్నైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జోసెఫ్ మరణించారని తెలుస్తోంది.
తన తండ్రి గురించి సమంతో ఓ ఇంటర్వ్యూలో ఇలా చెప్పింది. 'నా చిన్నతనంలో గుర్తింపు కోసం చాలా పోరాటం చేసేదాన్ని. అయితే, నేను ఏమీ తెలియని అమాయకురాలినని నా తండ్రి ఎక్కువగా అనుకునేవారు. నా కాలేజీ రోజుల్లో కూడా నన్నొక చిన్నపిల్లలా ఆయన చూసేవారు. ఈ విషయంలో మా నాన్న మాత్రమే కాదు.. చాలా మంది భారతీయ తల్లిదండ్రుల తీరు ఒకేలా ఉంటుంది. తమ పిల్లలను అలాగే చూస్తారు. అయితే, ఆ సమయంలో ఆయన చెప్పిన మాటలు నాపై ఎంతో ప్రభావం చూపించాయి.'
సమంత తండ్రి ఎప్పుడూ కూడా చిత్ర పరిశ్రమతో పాటు సోషల్ మీడియాకు దూరంగానే ఉంటారు. తెలుగు ఆంగ్లో-ఇండియన్ అయిన జోసెఫ్ ప్రభు మలయాళి కుటుంబానికి చెందిన నినెట్ ప్రభును వివాహం చేసుకున్నారు. మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన సమంత ఆర్థికంగా తన తండ్రికి చాలా సపోర్ట్‌గా ఉండేదని చెప్పవచ్చు.
ఆర్థిక ఇబ్బందుల వల్ల తనకు చదువుకోవాలని కోరిక ఉన్నప్పటికీ కుటుంబ స్థోమతను గ్రహించిన ఆమె పార్ట్‌టైమ్ ఉద్యోగం కూడా చేసేది. అయితే, మోడలింగ్‌పై ఉన్న ఇంట్రెస్ట్‌తో ఆ దిశగా వెళుతుంటే మొదట్లో కొందరు కుటుంబ సభ్యులు నెగెటివ్‌గా ప్రచారం చేసినా తన తల్లిదండ్రులు సపోర్ట్ చేశారని ఆమె చాలాసార్లు గుర్తు చేసుకున్నారు. తాను ప్రస్తుతం ఇంతటి స్థాయిలో ఉన్నానంటే దానికి ప్రధాన కారణం తండ్రే అంటూ సమంత పలుమార్లు గుర్తుచేసుకున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment