'గేమ్‌ ఛేంజర్‌' కోసం బాలీవుడ్‌ కింగ్‌.. కడపకు రానున్న చరణ్‌ | Shah Rukh Khan With Game Changer Promotional Events | Sakshi
Sakshi News home page

'గేమ్‌ ఛేంజర్‌' కోసం బాలీవుడ్‌ కింగ్‌.. కడపకు రానున్న చరణ్‌

Published Thu, Nov 14 2024 2:51 PM | Last Updated on Thu, Nov 14 2024 3:11 PM

Shah Rukh Khan With Game Changer Promotional Events

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్- శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా 'గేమ్ ఛేంజర్'. సంక్రాంతికి కానుకగా జనవరి 10న విడుదల కానున్న ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా విడుదలైన టీజర్‌ సినీ అభిమానులను మెప్పిస్తుంది. 'RRR'తో రామ్‌ చరణ్‌కు బాలీవుడ్‌లో  మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఏర్పడింది. దీంతో అక్కడి మార్కెట్‌పై 'గేమ్ ఛేంజర్' టీమ్‌ కన్నేసింది. అందుకు తగ్గట్లు అక్కడ ప్రమోషన్స్‌ కార్యక్రమాలను కూడా ప్రారంభించింది. ఈ క్రమంలోనే  టీజర్‌ను లక్నో వేదికగా విడుదల చేశారు.

ఆ ఈవెంట్‌ కోసం షారుఖ్‌ ఖాన్‌
ట్రైలర్‌ విడుదల వేడుకను బాలీవుడ్‌లో చాలా గ్రాండ్‌గా జరపాలని చిత్ర యూనిట్‌ ప్లాన్‌ చేస్తుంది. ఆడియో లాంఛ్‌ ఈవెంట్‌ను కూడా ఘనంగానే ప్లాన్‌ చేస్తుంది. అయితే, ఈ కార్యక్రమంలో ఏదో ఒకదానిలో బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌ పాల్గొననున్నారని తెలుస్తోంది. డైరెక్టర్ శంకర్ తన మూవీ ప్రమోషన్స్ కోసం గతంలో చాలా సార్లు  హాలీవుడ్ స్టార్స్‌ను ఆహ్వానించిన సందర్భాలు ఉన్నాయనే విషయం తెలిసిందే. ఇప్పుడు బాలీవుడ్‌లో గేమ్‌ ఛేంజర్‌ మార్కెట్‌ను పెంచుకునేందుకు షారుఖ్‌ను రంగంలోకి దింపుతున్నట్లు ప్రచారం ఉంది. బాలీవుడ్‌ మీడియాతో చిట్‌చాట్‌లు నిర్వహించడంతో పాటు విడుదలకు ఇంకా సమయం ఉండటంతో అక్కడ మరిన్ని ప్రచార కార్యక్రమాలను నిర్వహించేందుకు రూట్‌ మ్యాప్‌ను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

కడపకు రామ్‌ చరణ్‌
రామ్‌ చరణ్‌ కడప రానున్నారని సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. తాజా సమాచారం ప్రకారం నవంబర్‌ 18న జరుగనున్న 80వ దర్గా నేషనల్‌ ముషైరా ఘజల్‌ ఈవెంట్‌లో ఆయన  ముఖ్యఅతిథిగా పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమం గురించి పూర్తి వివరాలు చరణ్‌ టీమ్‌ వెల్లడిస్తుందని సమాచారం. గేమ్‌ ఛేంజర్‌ చిత్రాన్ని  శ్రీ వేంకటేశ్వర బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మించారు. తెలుగుతో పాటు తమిళ్‌, హిందీ భాషల్లో కూడా విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో  అంజలీ,  కియారా అద్వానీ, యస్​ జే సూర్య, శ్రీకాంత్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement