కార్పొరేషన్‌ ఎన్నికల నేపథ్యంలో ‘కార్పొరేటర్‌’ | Shakalaka Shankar Corporator Movie Trailer Out | Sakshi
Sakshi News home page

కార్పొరేషన్‌ ఎన్నికల నేపథ్యంలో ‘కార్పొరేటర్‌’

Published Sat, Aug 21 2021 10:54 AM | Last Updated on Sat, Aug 21 2021 10:54 AM

Shakalaka Shankar Corporator Movie Trailer Out - Sakshi

హాస్యనటుడు ‘షకలక’ శంకర్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘కార్పొరేటర్‌’. ఇందులో సునీతా పాండే, లావణ్యా శర్మ, కస్తూరి హీరోహీరోయిన్లుగా నటించారు. సంజయ్‌ పూనూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎ. పద్మనాభిరెడ్డి నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం.

ఈ సందర్భంగా ‘షకలక’ శంకర్‌ మాట్లాడుతూ – ‘‘ట్రైలర్‌కు మంచి స్పందన లభిస్తోంది. నా యాక్షన్‌ సీక్వెన్సెస్‌ బాగున్నాయని సన్నిహితులు ఫోన్‌ చేసి అభినందిస్తున్నందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు. ‘‘కార్పొరేషన్‌ ఎన్నికల నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం ఇది. వినోదాత్మకంగా సాగే ఈ చిత్రంలో ఓ సందేశం కూడా ఉంది. ఈ సినిమాలో ఐదు పాటలు, నాలుగు ఫైట్స్‌ ఉన్నాయి’’ అని దర్శక–నిర్మాతలు పేర్కొన్నారు. ఈ సినిమాకు యస్‌.వి. మాధురి సహనిర్మాత.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement