
నంది అవార్డు గ్రహీత రవి చావలి దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం 'బద్మాష్ గాళ్ళకి బంపర్ ఆఫర్'. ఈ సినిమాకు రమేశ్ కుమార్ నిర్మాతగా వ్యవహరించాడు. శాసనసభ చిత్రంతో కథానాయకుడిగా గుర్తింపు పొందిన ఇంద్రసేన , మ్యాడ్ చిత్రంలో నటించిన సంతోష్ హీరోలుగా నటిస్తుండగా ప్రజ్ఞ నయన్, నవీన రెడ్డి హీరోయిన్లుగా నటించారు. డబ్బు కోసం రియల్ ఎస్టేట్ దందా చేసే ఒక వ్యక్తి దగ్గర పని చేసే ఇద్దరు కుర్రోళ్ళు , అతన్నే ఎందుకు కిడ్నాప్ చేశారు?
ఆ కిడ్నాప్‌లో తెలిసిన రహస్యాలు ఏమిటి? చివరకు వాళ్ళు అనుకొన్న డబ్బు సంపాదించారా? లేదా? అనే పాయింట్ ఫుల్ కమర్షియల్ ఎలిమెంట్స్‌తో సినిమా కథ నడుస్తుంది. మలయాళీ నటి మెర్లిన్ ఫిలిప్, తమిళ నటుడు తారక్, శుభలేఖ సుధాకర్ గారు ప్రత్యేక పాత్రలో నటించారు. ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు, బెంగళూర్ , టెక్సాస్, అండమాన్ లో ఈ నెల 29 వ తేదీన రిలీజ్ అవుతుంది.
చదవండి: పృథ్వీరాజ్ చిన్నప్పటి క్యారెక్టర్ చేసింది ఇతడే! రవితేజతో రిలేషన్‌పై క్లారిటీ!
Comments
Please login to add a commentAdd a comment