
దర్శకుడు శంకర్ అంటే బ్రహ్మాండం . బ్రహ్మాండ మంటే శంకర్ అనేలా ఆయన చిత్రాలు ఉంటాయి. ఈయన చిత్రా లు నిర్మించడంలో లేట్ అయినా, చిత్రాలు మాత్రం లేటెస్ట్‌గా ఉంటాయి. కాగా 1996లో నటుడు కమలహాసన్ హీరోగా శంకర్ దర్శకత్వం వహించిన ఇండియన్ చిత్రం సంచలన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే.
కాగా సుమారు 28 ఏళ్ల తర్వాత అదే కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం ఇండియన్– 2. లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఇండియన్ – 2 చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 12వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. కాగా ఈ చిత్రం ప్రమోషన్‌లో బిజీ బిజీగా ఉన్న దర్శకుడు శంకర్ ఒక భేటీలో తన తదుపరి చిత్రాల గురించి పేర్కొన్నారు. తదుపరి 3 భారీ కథా చిత్రాలను చేయబోతున్నట్లు చెప్పారు.
అందులో ఒకటి చారిత్రాత్మక కథాంశంతో ఉంటుందని, మరొకటి జేమ్స్‌బాండ్ తరహాలో సాగే కథా చిత్రం అని, ఇక మూడోది స్పై కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు. ఈ మూడు చిత్రాలు భారీ బడ్జెట్లో బ్రహ్మాండంగా ఉంటాయని చెప్పారు. వీటికి ప్రపంచంలోనే ఆధునిక వీఎఫ్‌ఎక్స్ టెక్నాలజీతో రూపొందించ తలపెట్టినట్లు దర్శకుడు శంకర్ తెలిపారు. కాగా ఇండియన్ –3 చిత్రం షూటింగ్ కూడా పూర్తి కావడంతో మరో ఆరు నెలలు ఈ చిత్రం కూడా విడుదల అవుతుందని చెప్పారు. ఇక తాను తెలుగులో రామ్ చరణ్ కథానాయకుడిగా రూపొందిస్తున్న గేమ్ చేంజర్ చిత్రం షూటింగ్ మరో 15, 20 రోజుల్లో పూర్తి అవుతుందని ఆయన చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment