బిజినేపల్లి: ప్రస్తుత కాలంలో హెడ్‌ఫోన్స్, ఇయర్ బడ్స్ ప్రతిఒక్కరు ఎక్కువగా వినియోగిస్తున్నారని, తద్వారా వారు వినికిడి లోపానికి గురయ్యే అవకాశం ఉందని ప్రోగ్రాం అధికారి కృష్ణమోహన్ అన్నారు. సోమవారం మండలంలోని పాలెం జెడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రపంచ వినికిడి దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోగ్రాం అధికారి కృష్ణమోహన్ మాట్లాడుతూ చెవిలో అనవసరంగా దూది పుల్లలు, కట్టె పుల్లలు వంటి వాటిని ఉపయోగించి చెవి గుమిలిని తీయడం వలన కర్ణభేరికి గాయమై వినికిడి శక్తి కోల్పోతామని, చెవులు వాటంతట అవే శుభ్రపరుచుకుంటాయని చెప్పారు. చెవిలోకి నీరు పోకుండా చూసుకోవాలని, చెవిలో చీము కారడం, చెవి నొప్పి తదితర సమస్యలు కనిపిస్తే వెంటనే సమీపంలోని ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వైద్య, ఆరోగ్య సిబ్బంది విజయ్‌కుమార్, రాజేష్, ఆరోగ్య కార్యకర్తలు, ఆశాలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment