నార్లాపూర్– ముక్కిడిగుండం గ్రామాల మధ్య పెద్దవాగుపై బ్రిడ్జి నిర్మాణం తుది దశకు చేరుకుంది. బ్రిడ్జికి రెండు వైపులా 20 మీటర్ల మేరకు అప్రోచ్ రోడ్డు పనులు జరుగుతున్నాయి. వీలైనంత త్వరలో పనులు పూర్తిచేసి, ప్రారంభానికి చర్యలు తీసుకుంటాం. అయితే వర్షాకాలంలో పెద్దవాగు బ్రిడ్జిపైకి వెళ్లేందుకు సమీపంలోనే ఉన్న మరో వాగు అడ్డంకిగా మారుతుందనే విషయాన్ని గుర్తించాం. దీనిపై కూడా వంతెన నిర్మాణం కోసం గతంలో ప్రతిపాదనలు పంపాం. కానీ, నిధులు మంజూరు కాలేదు. ఇప్పుడు మళ్లీ ప్రతిపాదనలు పంపించాం. – సాయిరాం, పీఆర్‌ఏఈ
●
Comments
Please login to add a commentAdd a comment