వామ్మో చిరుత
మళ్లీ ఆలయ పరిసరాల్లో సంచారం
ఆందోళనలో భక్తులు
మహానంది: వదల బొమ్మాళీ.. నిన్నొదలా! అంటుంది చిరుతపులి. ఒకటి కాదు, రెండు కాదు పలు పర్యాయాలు మహానంది ఆలయ పరిసరాల్లోకి వస్తుండటంతో భక్తులు, స్థానికులు భయాందోళన చెందుతోంది. తాజాగా శుక్రవారం తెల్లవారుజామున గోశాల ప్రాంగణంలోకి మరోసారి చిరుతపులి రావడం కలకలం రేపింది. నల్లమల వైపు నుంచి వచ్చిన చిరుతపులి గోశాల వద్ద టెంపుల్ రోడ్డు మీదుగా వచ్చి తిరిగి అడవివైపు వెళ్లినట్లు స్థానిక దేవస్థానం సీసీ కెమెరాల్లో స్పష్టంగా కనిపిస్తుంది.
ఇప్పటికే గత కొద్ది రోజుల నుంచి మహానంది ఈశ్వర్‌నగర్, పార్వతీపురం, పాత బంగ్లా, గోశాల ప్రాంగణంలోనే ఉంటుండటంతో స్థానికులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. రెండ్రోజుల క్రితం నవనంది పుణ్యక్షేత్రాల్లో ఒకటైన కృష్ణనంది ఆలయం వద్ద ఓ చిరుతపులి కనిపించిన విషయం తెలిసిందే. గోశాల ప్రాంగణం వైపు పలు ప్రాంతాల భక్తులు వెళ్లకుండా అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంది. అటవీ అధికారులు వెంటనే స్పందించి చిరుతను బంధించి సుదూర ప్రాంతాలకు తరలించాలని భక్తులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment