ఇంటర్ పరీక్షలకు 92మంది గైర్హాజరు
నారాయణపేట ఎడ్యుకేషన్/కోస్గి రూరల్: జిల్లావ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. మంగళవారం జరిగిన ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 3,997 మంది విద్యార్థులకు గాను 3,905 మంది హాజరయ్యారు. జనరల్ విభాగంలో 3,447 మందికి గాను 3,375 మంది, ఒకేషనల్ విభాగంలో 550 మందికి గాను 530 మంది హాజరై పరీక్షలు రాయగా.. 92 మంది గైర్హాజరైనట్లు డీఐఈఓ సుదర్శన్‌రావు తెలిపారు.
● జిల్లా కేంద్రంలోని నాలుగు పరీక్ష కేంద్రాలతో పాటు కోస్గి ప్రభుత్వ కళాశాల, ప్రజ్ఞ జూనియర్ కళాశాలల్లో ఏర్పాటుచేసిన పరీక్ష కేంద్రాలను డీఐఈఓ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంటర్ బోర్డు నిబంధనల మేరకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. విద్యార్థులకు పరీక్షలు రాసే సమయంలో అవసరమైన సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు. అనంతరం పలు రికార్డులను పరీశీలించారు. డీఐఈఓ వెంట పరీక్షల విభాగం అదికారులు ప్రతాప్‌రెడ్డి, పరశురాం, పరేష్, ఈశ్వర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment