నారాయణపేట ఎడ్యుకేషన్: పదో తరగతి వార్షిక పరీక్షలు జిల్లాలో ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా 7613 మంది విద్యార్థులకుగాను 7591 మంది పదో తరగతి పరీక్షలకు హాజరయ్యారు. 22మంది గైర్హాజరయ్యారు. మొత్తం 39 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాలలో విద్యార్థులకు బెంచీలను ఏర్పాటు చేయడంతోపాటు తాగునీటి సమస్య లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రతి కేంద్రం వద్ద పోలీస్ బందోబస్తు, మెడికల్ సిబ్బందిని ఏర్పాటు చేశారు. రెండు పరీక్ష కేంద్రాలను స్టేట్ అబ్జర్వర్లు, ఆరు కేంద్రాలను ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీ చేశాయి. పరీక్ష ముగిసే వరకు అన్ని జిరాక్స్ సెంటర్లు మూసి ఉంచారు. విద్యార్థులను గంట ముందే పరీక్ష కేంద్రంలోకి అనుమతించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ సిక్తా పట్నాయక్ తనిఖీ చేశారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
ప్రశాంతంగా ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు
మొదటి రోజు 22 మంది గైర్హాజరు
మొదటి రోజు 22 మంది గైర్హాజరు
మొదటి రోజు 22 మంది గైర్హాజరు