
భగత్‌సింగ్ స్ఫూర్తితో ప్రజా సమస్యలపై పోరాటం
యాసంగితో పోలిస్తే పెరిగిన సాగు, ఎండిన పంటనష్టం వివరాలు.. (ఎకరాల్లో)
జిల్లా గత యాసంగిలో ప్రస్తుత పూర్తిగా ఎండిన
యాసంగిలో పంట (అంచనా..)
మహబూబ్‌నగర్ 1,12,000 1,25,000 20,000
నాగర్‌కర్నూల్ 1,16,577 80,772 2,000
జోగుళాంబ గద్వాల 44,379 69,694 6,000
వనపర్తి 90,123 1,40,000 5,000
నారాయణపేట 1,13,000 1,28,000 3,000
● వనపర్తి జిల్లాలో ఈ యాసంగిలో 1.40 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. జిల్లాకు జూరాల, భీమా, కేఎల్‌ఐ సాగు నీరు తగ్గడం.. భూగర్భ జలమట్టాలు గణనీయంగా తగ్గిపోవడంతో వనపర్తి, ఖిల్లాఘణపురం, పాన్‌గల్ మండలాల పరిధిలో ఇప్పటివరకు సుమారు 200 ఎకరాల మేర పంట ఎండిపోయినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. అయితే జిల్లావ్యాప్తంగా ఐదు వేల ఎకరాల వరకు వరి ఎండినట్లు తెలుస్తోంది.
● జోగుళాంబ గద్వాల జిల్లాలో సాగు నీరందక కేటీదొడ్డి మండలంలోని కొండాపురం, గువ్వలదిన్నే, పాతపాలెం, ఉమిత్యాల, నందిన్నె, ధరూర్ మండలంలోని అల్లాపాడు, కోతులగిద్దె, కొత్తపాలెం, గట్టు మండలంలోని పెంచికలపాడు, మాచర్ల, ఆరగిద్ద, గొర్లఖాన్‌దొడ్డి గ్రామాల్లో సుమారు ఐదు వేల నుంచి ఆరు వేల ఎకరాల్లో వరి ఎండిపోయింది. అధికారులు మాత్రం 250 ఎకరాల్లో మాత్రమే పంట ఎండిపోయినట్లు చెబుతున్నారు.
● నాగర్‌కర్నూల్ జిల్లాలో 175 ఎకరాల్లో వరి, 72 ఎకరాల్లో మొక్కజొన్న, 10 ఎకరాల మేర కంది, ఇతర పంటలు.. అదేవిధంగా నారాయణపేట జిల్లాలో 205 ఎకరాల్లో వరి ఎండినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. అయితే ఈ రెండు జిల్లాలు కలిపి నీరందక సుమారు నాలుగు వేల ఎకరాల మేర పంట ఎండినట్లు తెలుస్తోంది.
నారాయణపేట: ప్రజా పోరాటాల ద్వారానే ప్రజలకు దోపిడీ పీడనల నుండి విముక్తి జరుగుతుందన్న భగత్‌సింగ్ స్ఫూర్తితో పోరాటాలకు సిద్ధం కావాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జీ వెంకట్రామిరెడ్డి ప్రజలకు పిలుపు ఇచ్చారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని సిపిఎం, డివైఎఫ్‌ఐ ,ఎస్‌ఎఫ్‌ఐ ఆద్వర్యంలో భారీ ర్యాలి నిర్వహించారు. అనంతరం మున్సిపల్ పార్క్ దగ్గర బహిరంగ సభ నిర్వహించారు. భగత్ సింగ్, రాజ్‌గురు సుఖ్‌దేవ్ 94వ వర్ధంతి సందర్భంగా అమల చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భగత్ సింగ్ చిన్నప్పటి నుంచి లౌకిక భావాలతో విస్తృతమైన ప్రజా పోరాటాల ద్వారా బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా కులం మతం ప్రాంతాలకు అతీతంగా ప్రజలందరినీ సంఘటితం చేసి పోరాడారని అన్నారు. బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత చరిత్ర వక్రీకరణలు, విభజన, విద్వేష రాజకీయాలతో బ్రిటీష్ వారిని మించి నియంతృత్వంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. నేడు భగత్ సింగ్ ఆశయాలకు బిన్నంగా పాలన నడిపించడమే కాకుండా మళ్లీ భగత్‌సింగ్ వారసులం అంటూ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. దోపిడీ, పీడనకు వ్యతిరేకంగా ప్రజలందరినీ ఐక్య విస్తృత ప్రజా ఉద్యమాల ద్వారా స్వాతంత్రోద్యమ కాంక్షను పెంచారని అన్నారు. ప్రజా పోరాటాలు వ్యక్తితో ప్రారంభమై ఒక వ్యక్తితో ముగిసేవి కాదని సమాజంలో దోపిడీ, పీడన ఉన్నంతవరకు పోరాటం కొనసాగుతూనే ఉంటుందన్న భగత్ సింగ్ స్ఫూర్తితో ప్రజలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న శ్రమ దోపిడి పీడనలకు, విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజలు కార్మిక వర్గం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. సామ్రాజ్యవాద యుద్ధాల దోపిడీ పీడన నుండి మానవజాతి సామాజిక వ్యవస్థను నెలకొల్పడమే అంతిమ లక్ష్యంగా జీవితాంతం పోరాడిన భగత్ సింగ్ స్ఫూర్తితో ప్రజల పక్షాన చివరిదాకా నిలిచి సీపీఎం పోరాడుతుందని అన్నారు. కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు గోపాల్, బాల్ రామ్, అంజిలయ్య గౌడ్, పుంజనూరు ఆంజనేయులు,మహేష్ కుమార్ గౌడ్, కార్మిక, విద్యార్ధి, ప్రజా సంఘాల నాయకులు మహ్మద్ అలీ, బాలు, పవన్ జోషి, అశోక్, దస్తప్ప, నర్సింహ, రాములు, పాల్గొన్నారు
మార్గదర్శి భగత్‌సింగ్
నారాయణపేట ఎడ్యుకేషన్: దేశ స్వాతంత్య్రం కోసం తమ ప్రాణాలను సైతం తృణపాయంగా వదిలేసిన ధీరులు భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్ అని, వారు దేశ యువతకు మార్గదర్శులని పీవైఎల్ రాష్ట్ర అధ్యక్షుడు కాశీనాథ్ అన్నారు. పీడీఎస్‌యూ, పీవైఎల్, యువజన సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో కాశీనాథ్, సాయికుమార్, గౌస్ మారుతి, వెంకటేష్, రాము, సాగర్, ప్రేమ్‌రాజ్, కృష్ణ, నితిన్ విద్యార్థులు పాల్గొన్నారు.
●
ఆశలు.. ఆవిరి

భగత్‌సింగ్ స్ఫూర్తితో ప్రజా సమస్యలపై పోరాటం

భగత్‌సింగ్ స్ఫూర్తితో ప్రజా సమస్యలపై పోరాటం

భగత్‌సింగ్ స్ఫూర్తితో ప్రజా సమస్యలపై పోరాటం