
మెడికల్ కళాశాలకుఅంబులెన్స్ అందజేత
నారాయణపేట: జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాలను, జిల్లాస్పత్రికి వేణిరావు ఫౌండేషన్ వారు అంబులెన్స్‌ను గురువారం అందజేశారు. వేణిరావు ఫౌండేషన్ అధినేత రత్న చేతుల మీదుగా హైదరాబాద్‌లో ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డికి అంబులెన్స్‌కు సంబంధించిన తాళాలు అందజేశారు.
రామన్‌పాడులో
తగ్గుతున్న నీటిమట్టం
మదనాపురం: మండలంలోని రామన్‌పాడు జలాశయంలో రోజురోజుకు నీటిమట్టం తగ్గుతుందని.. గురువారం 1,017 అడుగులు ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ కాల్వ నుంచి 550 క్యూసెక్కుల వరద కొనసాగుతుండగా.. సమాంతర కాల్వలో నీటి సరఫరా లేదని చెప్పారు. ఇదిలా ఉండగా జలాశయం నుంచి ఎన్టీఆర్ కాల్వకు 24 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 71 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నామని వివరించారు.
గ్రామీణ ప్రాంతాలకు తపాలా సేవలు
లింగాల: మారుమూల గ్రామీణ ప్రాంత ప్రజలకు సైతం అందుబాటులోకి తపాలా శాఖ సేవలను విస్తరిస్తున్నట్లు వనపర్తి డివిజన్ ఎస్‌పీఓ భూమన్న అన్నారు. మండలంలోని రాయవరం గ్రామ పంచాయతీకి నూతనంగా మంజూరైన బ్రాంచి పోస్టాఫీసును గురువారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. రాయవరంలో బ్రాంచి పోస్టాఫీసు ఏర్పాటు చేయాలని ప్రజలు చాలా కాలంగా కోరుతున్నారన్నారు. ఈ బ్రాంచి పోస్టాఫీసు పరిధిలోకి కొత్తచెర్వుతండా, పాతరాయవరం, వడ్డెబక్కనగూడెం గ్రామాలు వస్తాయన్నారు. ఇప్పటి వరకు రాయవరంతోపాటు ఇతర గ్రామాల వారు అంబట్‌పల్లి పోస్టాఫీసుకు వెళ్తూ ఇబ్బందులకు గురయ్యేవారని, ఇక నుంచి ఆ ఇబ్బందులు తప్పినట్లేనని ఆయన పేర్కొన్నారు. ఈ పోస్టాఫీసు ద్వారా ఆసరా పింఛన్లు, ఉపాధి కూలీల డబ్బులు, ఇతరత్రా సేవలు ప్రజలు పొందవచ్చన్నారు. కార్యక్రమంలో పోస్టల్ డిపార్ట్‌మెంట్ అధికారులు సృజన్‌నాయక్, రవికుమార్, ప్రసాద్, రవికుమార్, బ్రాంచి పోస్టాఫీస్ ఇన్‌చార్జ్ బాలాజీనాయక్, నాయకులు మల్లయ్య, తిరుపతిరెడ్డి, రాజు తదితరులు పాల్గొన్నారు.
వేరుశనగ క్వింటాల్ రూ.6,646
జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌యార్డులో గురువారం వేరుశనగ క్వింటాల్ గరిష్టంగా రూ. 6,646, కనిష్టంగా రూ. 5,222 ధరలు లభించాయి. అదే విధంగా కందులు గరిష్టంగా రూ. 6,001, కనిష్టంగా రూ. 5,000, మొక్కజొన్న గరిష్టంగా రూ. 2,281, కనిష్టంగా రూ. 1,827, జొన్నలు గరిష్టంగా రూ. 4,377, కనిష్టంగా రూ. 4,089, ఆముదాలు గరిష్టంగా రూ. 6,329, కనిష్టంగా రూ. 6,270, మినుములు రూ. 7,316, రాగులు గరిష్టంగా రూ. 3,077, కనిష్టంగా రూ. 2,207 ధరలు వచ్చాయి.
● దేవరకద్ర మార్కెట్‌యార్డులో జరిగిన ఈ టెండర్లలో ఆర్‌ఎన్‌ఆర్ ధాన్యం క్వింటాల్‌కు గరిష్టంగా రూ. 2,039, కనిష్టంగా రూ. 1,909 ధరలు లభించాయి. ఆముదాలు గరిష్టంగా రూ. 6,011, కనిష్టంగా రూ. 6,000 ధరలు వచ్చాయి. సీజన్ ప్రారంభం కావడంతో మార్కెట్‌కు దాదాపు 400 బస్తాల ధాన్యం అమ్మకానికి వచ్చింది.

మెడికల్ కళాశాలకుఅంబులెన్స్ అందజేత