
ప్రాజెక్టు భద్రతకే ఔట్‌పోస్టు ఏర్పాటు
అమరచింత: కృష్ణానదిపై నిర్మించిన ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు భద్రత దృష్ట్యా పోలీస్ ఔట్‌పోస్టు ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ఎస్పీ రావుల గిరిధర్ తెలిపారు. గురువారం ప్రాజెక్టు వద్ద పోలీస్ ఔట్‌పోస్ట్‌తో పాటు గెస్ట్‌హౌజ్ నిర్మాణానికి గురువారం పీజేపీ నందిమళ్ల డివిజన్ క్యాంపు ఏఈతో కలిసి ఎస్పీ స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వీటి నిర్మాణాలకు నాలుగు ఎకరాల స్థలంతో పాటు సుమారు రూ.కోటి అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని.. త్వరలోనే ఔట్‌పోస్టు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. అనంతరం పెద్దమందడి మండలంలోని పంటపొలాల్లో పట్టుకున్న భారీ మొసలిని జూరాల బ్యాక్‌వాటర్‌లో వదలడాన్ని ఆయన పరిశీలించారు.
వివాదాస్పద స్థలం పరిశీలన..
మండల కేంద్రంలోని నాగులకుంటలో ఉన్న 13.08 ఎకరాల శిఖం భూమి కబ్జాకు గురికావడంతో గురువారం ఎస్పీ రావుల గిరిధర్ పరిశీలించి అక్కడి రైతులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. శిఖం భూమిని కబ్జా చేసిన వారిపై కేసులు నమోదు చేయాలని సీఐని ఆదేశించారు. నాగులకుంటలో వర్షపునీరు నిలిచేలా ఏర్పాట్లు చేయాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. ఆయన వెంట సీఐ శివకుమార్, ఎస్‌ఐ సురేష్. ఇరిగేషన్ ఏఈ ఆంజనేయులు ఉన్నారు.
రూ.కోటితో ప్రతిపాదనలు
వనపర్తి ఎస్పీ రావుల గిరిధర్