
ప్రభుత్వానికి కృతజ్ఞతలు
గతంలో కేవలం వేతనాల కోసమే ప్రభుత్వం నిధులు కేటాయించేది. కానీ, ఈ సంవత్సరం వేతనాలతో పాటు అభివృద్ధి కోసం కూడా నిధు లు వెచ్చించిన ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు. ప్రభుత్వం అవసరమైన నిధులు కేటా యించడంతో యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన వసతులు, నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేస్తాం. బాలి కలకు, బాలురకు ప్రత్యేకంగా హాస్టళ్లు, అకాడమిక్ బ్లాక్, ల్యాబ్స్ నిర్మాణంపై దృష్టిసారిస్తాం. లా, ఇంజినీరింగ్ కళాశాల కోసం కూడా భవనాల నిర్మాణం చేపడతాం. విద్యార్థుల చదువు లు పూర్తయిన వెంటనే ఉద్యోగాలు సాధించే విధంగా కొత్త కోర్సులు ప్రారంభించేలా చూస్తాం. – శ్రీనివాస్, పీయూ వైస్ చాన్స్‌లర్
●