నారాయణపేట: చేనేత కార్మికులు, చేనేత సహకార సంఘాల అధ్యక్షులు, మాస్టర్ వీవర్లకు డిజిటల్ మార్కెటింగ్‌పైన కలెక్టరేట్‌లో శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. హైదరాబాద్ నుంచి చేనేత జోళీ శాఖ అధికారి దీప్తి వారి టీమ్ ఈమేరకు అవగాహన కల్పించారు. డిజిటల్ మార్కెటింగ్లో సేల్స్ ఏవిధంగా చేయాలి అనే దానిపై క్లుప్తంగా వివరించారు. కార్యక్రమంలో జేడీ ఇందుమతి, ఆర్‌డీడీ పద్మ, ఓఎస్‌డి రాతన్ కుమార్, సహయ అభివృద్ధి అధికారి రాజేశ్, టెస్కో వారి టీం, సహాయ సంచాలకు, చేనేత, జౌళి శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
‘కొడంగల్’ ఎత్తిపోతల పనుల పరిశీలన
మక్తల్: కొడంగల్ – నారాయణపేట ఎత్తపోతల పనుల్లో భాగంగా చేపడుతున్న పంప్‌హౌజ్ పనుల నాణ్యతను ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ వెంకటరమణ, ఎస్‌ఈ శ్రీధర్, ఈడీ రమేష్ పరిశీలించారు. శుక్రవారం కాట్రేశపల్లి నుంచి నారాయణపేట మండంలోని పెరపళ్ల వరకు పనులు పర్యవేక్షించారు. వారి వెంట ఏఈ సూర్య, డిఈ రాఘవ,ఏఈఈ నాగశివ, తదితరులు పాల్గొన్నారు.
చింతపండు క్వింటాల్ రూ.7,350
నారాయణపేట: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో శుక్రవారం చింతపండు గరిష్టంగా రూ.7,350, కనిష్టంగా రూ.4,250 ధర పలికింది. పెసర గరిష్టంగా రూ.7,575, కనిష్టంగా రూ.7,506, వేరుశనగ గరిష్టంగా రూ.5,520, కనిష్టంగా రూ.4,550, జొన్నలు గరిష్టంగా రూ.4,425, కనిష్టంగా రూ.2,555, అలసందలు గరిష్టంగా రూ.6,851, కనిష్టంగా రూ.6,769, ఎర్ర కందులు గరిష్టంగా రూ.7,236, కనిష్టంగా రూ.7,123, తెల్ల కందులు గరిష్టంగా రూ.7,429, కనిష్టంగా రూ.6,550 ధరలు పలికాయి.
మార్కెట్‌కు మూడు రోజులు సెలవు
స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డుకు శనివారం నుంచి సోమవారం వరకు మూడు రోజుల పాటు సెలవులు ఉంటాయని మార్కెట్ కార్యదర్శి భారతి ఒక ప్రకటనలో తెలిపారు. 29 శనివారం అమావాస్య, 30న ఆదివారం, ఏప్రిల్ 1న రంజాన్‌ను పండుగ సందర్భంగా సెలవు ఉందని, వ్యాపారస్తులు, రైతులు గమనించాలని కోరారు.

డిజిటల్ మార్కెటింగ్‌పై అవగాహన