
అధికారులు సమన్వయంతో పనిచేయలి
నారాయణపేట: ఇది సీఎం జిల్లా.. అధికారులంతా సమన్వయంతో పని చేసి జిల్లాకు మంచిపేరు తీసుకురావాలని.. రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో వరి ధాన్యం (సన్న రకం) కొనుగోలుకు సంబంధించి క్వింటాకు రూ.500 బోనస్ ప్రకటించిందని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. వరి ధాన్యం కొనుగోలుపై గురువారం జిల్లా కేంద్రానికి సమీపంలోని సింగారం వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసే విషయంలో నిర్వాహకులు ఖచ్చితంగా ప్రభుత్వ నిబంధనలను పాటించాలని, సన్నాలకు బదులు దొడ్డు రకం వడ్లను కొనుగోలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వరి ధాన్యం కొనుగోళ్ల అంశాన్ని సంబంధిత శాఖల అధికారులంతా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం జారీ చేసిన జీవో, రూల్స్, గైడ్ లైన్‌న్స్ ను అందరూ అమలు చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాలలో సన్న రకం వడ్లు దొడ్డు రకం వడ్లు వేర్వేరు కౌంటర్లలో కొనుగోలు చేసి, వేరు వేరు రిజిస్టర్ లలో నమోదు చేయాలని తెలిపారు.
కేంద్రాల్లో ఏర్పాట్లు చేయాలి
జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, అందుకు అవసరమైన ఫ్లెక్సీలు, తేమను కోలిచే యంత్రాలు, రిజిస్టర్లు, ముఖ్యంగా ట్యాబ్ లను సిద్ధం చేసుకోవాలన్నారు.కేంద్రంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా వడ్లు కొనుగోలు చేయాలని ఆమె పునరుద్ఘాటించారు. గతేడాది ట్రాన్స్‌పోర్ట్ పరంగా సమస్యలు ఎదురైనట్లు తన దృష్టికి వచ్చిందని, ఈసారి అలాంటి సమస్యలు ఏమి లేకుండా క్షేత్రస్థాయిలో అధికారులు, కొనుగోలు కేంద్ర నిర్వాహకులు ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. జిల్లా సరిహద్దు చెక్ పోస్టులలో గట్టి నిఘా ఏర్పాటు చేయాలని పోలీసు శాఖ అధికారులకు ఆమె సూచించారు. డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. రూ.500 బోనస్ ను రైతాంగం సద్వినియోగం చేసుకోవాలని అన్నా రు. రెవెన్యూ అదనపు కలెక్టర్ బేన్ షాలోమ్ మాట్లాడుతూ.. రైతులు ధాన్యాన్ని నేరుగా కొనుగోలు కేంద్రాలకు తీసుకు వస్తే తేమశాతం పరిశీలించిన త ర్వాత నిర్వాహకులు గన్ని బ్యాగులను ఇస్తారని, అ క్కడే తూకాలు చేయిస్తారని చెప్పారు. డీఏఓ జాన్ సుధాకర్, సివిల్ సప్లై జిల్లా మేనేజర్ సైదులు, డీఎస్పీ నల్లపు లింగయ్య, ఆర్టీఓ మేఘా గాంధీ, డీఆర్డీఓ మొగులప్ప తమ తమ శాఖలకు సంబంధించిన విషయాల గురించి వివరించారు. ఆర్డీఓ రామచందర్ నాయక్, డీసీఓ శంకరా చారి,డీఎంఓ బాలామణి, మార్కెట్ చైర్మన్ శివారెడ్డి పాల్గొన్నారు.
అర్హులందరికి ‘రాజీవ్ యువ వికాసం’
రాజీవ్ యువ వికాస పథకానికి వీలైనంత ఎక్కువమంది అర్హులు దరఖాస్తులు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యువత ఆర్థికంగా ఎదిగేందుకు ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ పథకం అమలు ద్వారా జిల్లాలో నిరుద్యోగం తగ్గుతుందన్నారు. అర్హులందరూ దరఖాస్తు చేసుకున్న తర్వాత సంబంధిత పత్రాలన్నింటినీ మున్సిపల్ లేదా ఎంపీడీవో కార్యాలయాల్లో అందించాలన్నారు. మండలాల వారీగా ఇప్పటివరకు ఎన్నెన్ని దరఖాస్తులు వచ్చాయని అడి గి తెలుసుకున్నారు. అలాగే జిల్లాలో ఇప్పటి వరకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ఏ ఏ దశల్లో ఉన్నాయని హౌసింగ్ అధికారులతో ఆరా తీశారు.
వరి ధాన్యం కొనుగోళ్లలో నిబంధనలు పాటించాలి
కలెక్టర్ సిక్తా పట్నాయక్