
దేశవ్యాప్తంగా మార్చి 15, 16 తేదీల్లో బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తొమ్మిది ప్రధాన బ్యాంక్ ఉద్యోగుల సంఘాలు అఖిల భారత సమ్మెకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఆ రెండు రోజులు బ్యాంకు సేవలకు అంతరాయం కలగొచ్చొని స్టాక్ ఎక్స్‌ఛేంజీలకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సమాచారం ఇచ్చింది. అలాగే రాబోయే వారం రోజుల్లో ఐదు రోజులు బ్యాంకింగ్ సేవలకు అంతరాయం ఏర్పడనుంది. మార్చి 11న శివరాత్రి సందర్భంగా బ్యాంకులకు సెలవు. మార్చి 13న రెండో శనివారం, మార్చి 14న ఆదివారం సందర్భంగా బ్యాంకులకు సెలవు.
మార్చి 15, 16 తేదీల్లో సమ్మె కారణంగా బ్యాంకుల్లో కార్యకలాపాలకు ఆటంకం తప్పదు. అంటే వచ్చేవారంలో బ్యాంకు కార్యకలాపాలు మార్చి 12, మార్చి 17న మాత్రమే జరుగుతాయి. కాబట్టి ఖాతాదారులు బ్యాంకు లావాదేవీలు, ఇతరత్రా పనుల కోసం వెళ్లాలని అనుకుంటే ఈ సెలవులకు తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవడం మంచిది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2021-22 బడ్జెట్ ప్రసంగంలో పెట్టుబడుల ఉప సంహరణలో భాగంగా రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు, సాధారణ భీమా సంస్థను ప్రైవేటీకరణ చేయనున్నట్లు ప్రకటించారు. బ్యాంకుల ప్రైవేటీకరణకు నిరసనగా బ్యాంకు యూనియన్లు సమ్మెను ప్రకటించాయి.
Comments
Please login to add a commentAdd a comment