Bank employees to strike
-
బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్!
దేశవ్యాప్తంగా మార్చి 15, 16 తేదీల్లో బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తొమ్మిది ప్రధాన బ్యాంక్ ఉద్యోగుల సంఘాలు అఖిల భారత సమ్మెకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఆ రెండు రోజులు బ్యాంకు సేవలకు అంతరాయం కలగొచ్చొని స్టాక్ ఎక్స్ఛేంజీలకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సమాచారం ఇచ్చింది. అలాగే రాబోయే వారం రోజుల్లో ఐదు రోజులు బ్యాంకింగ్ సేవలకు అంతరాయం ఏర్పడనుంది. మార్చి 11న శివరాత్రి సందర్భంగా బ్యాంకులకు సెలవు. మార్చి 13న రెండో శనివారం, మార్చి 14న ఆదివారం సందర్భంగా బ్యాంకులకు సెలవు. మార్చి 15, 16 తేదీల్లో సమ్మె కారణంగా బ్యాంకుల్లో కార్యకలాపాలకు ఆటంకం తప్పదు. అంటే వచ్చేవారంలో బ్యాంకు కార్యకలాపాలు మార్చి 12, మార్చి 17న మాత్రమే జరుగుతాయి. కాబట్టి ఖాతాదారులు బ్యాంకు లావాదేవీలు, ఇతరత్రా పనుల కోసం వెళ్లాలని అనుకుంటే ఈ సెలవులకు తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవడం మంచిది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2021-22 బడ్జెట్ ప్రసంగంలో పెట్టుబడుల ఉప సంహరణలో భాగంగా రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు, సాధారణ భీమా సంస్థను ప్రైవేటీకరణ చేయనున్నట్లు ప్రకటించారు. బ్యాంకుల ప్రైవేటీకరణకు నిరసనగా బ్యాంకు యూనియన్లు సమ్మెను ప్రకటించాయి. -
26న బ్యాంకుల సమ్మె
ప్రభుత్వ రంగంలోని మూడు బ్యాంకుల విలీనాన్ని వ్యతిరేకిస్తూ.. దాదాపు 10 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు దేశవ్యాప్తంగా డిసెంబర్ 26న (బుధవారం) సమ్మెకు దిగనున్నారు. ప్రైవేట్ బ్యాంకుల ఉద్యోగులు కూడా ఇందులో పాల్గొననున్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడాలో విజయా బ్యాంక్, దేనా బ్యాంక్‌ల విలీనాన్ని వ్యతిరేకించడంతో పాటు వేతనాల పెంపు డిమాండ్‌తో ప్రభుత్వ రంగ బ్యాంకుల ఆఫీసర్స్ శుక్రవారం ఒక రోజు సమ్మె నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇందులో సుమారు 3.20 లక్షల మంది అధికారులు పాల్గొన్నారు. ఈ మూడు బ్యాంకులను విలీనం చేయడం ద్వారా దేశీయంగా మూడో అతి పెద్ద బ్యాంకును ఏర్పాటు చేయాలని కేంద్రం సెప్టెంబర్‌లో ప్రతిపాదించింది. అయితే, ఈ విలీనం వల్ల ఇటు బ్యాంకులకు గానీ అటు కస్టమర్లకు గానీ ఎటువంటి ప్రయోజనం ఉండబోదని, పైగా రెండు వర్గాల ప్రయోజనాలకు ప్రతికూలమేనని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) పేర్కొంది. విలీనాల ద్వారా పెద్ద బ్యాంకుల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రయత్ని స్తోందని, అయితే మొత్తం ప్రభుత్వ బ్యాంకులన్నింటినీ కలిపేసినా టాప్ 10 గ్లోబల్ బ్యాంకుల్లో చోటు దక్కే అవకాశాలు లేవని వ్యాఖ్యానించింది. ఆలిండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్, ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్, నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ వర్కర్స్ తదితర 9 యూనియన్లు.. యూఎఫ్‌బీయూలో భాగం. -
7న ఐఎన్జీ వైశ్యా బ్యాంక్ ఉద్యోగుల సమ్మె
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లాభాల్లో నడుస్తున్న పాతతరం ప్రైవేటు రంగ బ్యాంక్ ఐఎన్జీ వైశ్యాను కొత్త తరం ప్రైవేటు రంగ బ్యాంక్ కోటక్ మహీంద్రాలో విలీనం చేయడంపై ఐఎన్జీ వైశ్యా బ్యాంకు ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కోటక్ బ్యాంక్‌లో విలీనాన్ని నిరసిస్తూ జనవరి 7న దేశవ్యాప్తంగా సమ్మె చేయునున్నట్లు ఐఎన్జీ వైశ్యా ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. గురువారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆల్ ఇండియా వైశ్యా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ కె.జె.రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ యూనియున్లతో మాటమాత్రమైనా చెప్పకుండా కోటక్ బ్యాంక్‌లో వీలనం చేయాలన్న ఐఎన్జీ వైశ్యా యాజమాన్య నిర్ణయాన్ని తప్పు పట్టారు.