భోపాల్: గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ (59) సోమవారం మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత రాష్ట్ర గవర్నర్ ఆచార్య దేవవ్రత ప్రమాణ స్వీకారం చేయించారు.
కాగా, గుజరాత్ 17వ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్‌ను అదృష్టం వరించింది. ఆదివారం సమావేశమైన బీజేపీ శాసనసభా పక్షం ఆయనను తమ నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది. రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 182 స్థానాలుండగా, 112 మంది బీజేపీ సభ్యులున్నారు. శాసనసభా పక్ష సమావేశానికి వీరంతా హాజరయ్యారు. తదుపరి సీఎంగా భూపేంద్ర పటేల్ పేరును శనివారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన విజయ్ రూపానీ ప్రతిపాదించారు. ఇందుకు బీజేపీ ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. 2017లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
ఉత్తరప్రదేశ్ ప్రస్తుత గవర్నర్ ఆనందీబెన్ గతంలో ప్రాతినిధ్యం వహించిన ఘట్లోడియా స్థానం నుంచే భూపేంద్ర 2017 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు. 2015-2017 మధ్య అహ్మదాబాద్ పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్‌గా పనిచేశారు. 2010-2015 మధ్య అహ్మదాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గానూ వ్యవహరించారు.
Comments
Please login to add a commentAdd a comment