Uttar Pradesh: BJP MLA Arvind Giri Dies Of Heart Attack - Sakshi
Sakshi News home page

BJP MLA Arvind Giri: గుండెపోటుతో బీజేపీ ఎమ్మెల్యే మృతి.. సీఎం సంతాపం

Published Tue, Sep 6 2022 10:46 AM | Last Updated on Tue, Sep 6 2022 10:59 AM

UP Bjp MLA Arvind Giri Dies Of Heart Attack - Sakshi

లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ బీజేపీ ఎ‍మ్మెల్యే అరవింద్ గిరి హఠాన్మరణం చెందారు. మంగళవారం ఉదయం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయన లఖింపూర్ ఖేరి జిల్లా గోలా గోకరన్‌నాథ్ నియోజకవర్గం నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.  సంబంధిత వర్గాలు చెప్పిన వివరాల ప్రకారం చికిత్స కోసం లక్నో తీసుకెళ్లే క్రమంలో సీతాపుర్ సమీపంలో అరివింద్ గిరి మరణించారు.

ఎమ్మెల్యే మృతి పట్ల యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అరవింద్ గిరి మృతి దురదృష్టకరం అని విచారం వ్యక్తం చేశారు. కుటుంబసభ్యులకు భగవంతుడు మనోధైర్యం చేకూర్చాలని ప్రార్థించారు.
చదవండి: యాత్రతో రాత మారేనా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement