‘రెమాల్‌’ తుపాన్‌ టెన్షన్‌.. కోల్‌కత్తాకు విమానాలు బంద్‌ | Cyclone 'Remal' Expected To Make Landfall Near Bengal Coast | Sakshi
Sakshi News home page

Cyclone Remal: ‘రెమాల్‌’ తుపాన్‌ టెన్షన్‌.. కోల్‌కత్తాకు విమానాలు బంద్‌

Published Sun, May 26 2024 8:17 AM | Last Updated on Sun, May 26 2024 12:28 PM

Cyclone 'Remal' Expected To Make Landfall Near Bengal Coast

కోల్‌కత్తా: పశ్చిమ బెంగాల్‌ను రెమాల్‌ తుపాన్‌ టెన్షన్‌ పెడుతోంది. తుపాన్‌ కారణంగా బెంగాల్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించింది. కోల్‌కత్తాకు రెడ్‌ అలర్ట్‌ విధించింది. ఈ నేపథ్యంలో బెంగాల్‌లో సహాయక చర్యలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. తుపాన్ కారణంగా కోల్‌కతాలోని విమానాశ్రయం, పోర్టులో రాకపోకలను నిలిపివేశారు.

కాగా, రెమాల్‌ తుపాన్‌ ప్రభావం బెంగాల్‌ను వణికిస్తోంది. కోల్‌కత్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశమున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. బెంగాల్‌ నుంచి విమానాల రాకపోకలను ఆదివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి సోమవారం ఉదయం తొమ్మిది గంటల వరకు నిలిపివేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.

 

మరోవైపు, కోల్‌కతాలోని శ్యామ ప్రసాద్‌ ముఖర్జీ పోర్టుని కూడా మూసివేస్తున్నట్టు పోర్ట్ చైర్మన్ రతేంద్ర రామన్ తెలిపారు. అన్ని కార్గో షిప్‌, కంటైనర్‌ సంబంధిత కార్యకలాపాలను ఆదివారం సాయంత్రం నుంచి 12 గంటల పాటు నిలివేస్తున్నామన్నారు. ఓడరేవులో పనిచేస్తున్న ఉద్యోగుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. పోర్ట్ వద్ద రైల్వే కార్యకలాపాలు సైతం నిలిసివేయనున్నట్టు స్పష్టం చేశారు.

 

ఇదిలా ఉండగా.. బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్‌ తుపాన్‌ ఆదివారం రాత్రి బంగాళాఖాతం తీరాన్ని దాటే అవకాశం ఉన్నది. పశ్చిమ బెంగాల్‌, బంగ్లా మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ అంచనా వేసింది. తుపాను నేపథ్యంలో గంటకు 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశాలున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది. తుపాన్‌ ప్రభావంతో బెంగాల్‌తో పాటు ఉత్తర ఒడిశా ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. రెమాల్‌ తుపాన్‌ ఎఫెక్ట్‌ తెలుగు రాష్ట్రాలపై ఎక్కువగా ఉండదని వాతావరణ శాఖ పేర్కొంది. 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement