సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ఆర్థిక నేరాలు పెరిగిపోతున్న నేపథ్యంలో అవకతవకల సత్వర గుర్తింపునకు వీలుగా ఇతర ఏజెన్సీల డేటాతో సులభంగా యాక్సెస్ చేసుకునేలా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను సిద్ధంచేసుకుంది. సీబీఐ, నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్ (ఎన్‌ఐజీ), ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్‌ఐయూ), కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ)తో పాటు ఇతర ఏజెన్సీల వద్ద ఉన్న వివరాలను సరిపోల్చుకునే వ్యవస్థను సిద్ధంచేసుకుంది.
కోర్ ఈడీ ఆపరేషన్ సిస్టమ్ పేరుతో అభివృధ్ధి చేసిన ఈ సాఫ్ట్‌వేర్ ద్వారా నేర ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు, వారి ఆర్థిక లావాదేవీలు, వారిపై నమోదైన కేసులు, అనుబంధ పత్రాలను ఆన్‌లైన్ ద్వారా పొందటం సులభం కానుంది. ఆర్థిక నేరాల పరిశోధనలో వేగాన్ని పెంచేందుకు, ఇతర ఏజెన్సీలతో సమన్వయం చేసుకునేందుకు ఇది దోహదపడనుంది.
Comments
Please login to add a commentAdd a comment