
సిమ్లా: బలవంతపు మత మార్పిడుల నివారణకు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కఠిన నిబంధనలను తీసుకువచ్చింది. శనివారం అసెంబ్లీ ఆమోదించిన చట్ట సవరణ బిల్లు ప్రకారం.. ఒకే విడతలో ఇద్దరు, అంతకంటే ఎక్కువ మందిని బలవంతంగా లేదా మాయమాటలు చెప్పి మతం మార్పించిన వారికి గరిష్టంగా పదేళ్ల వరకు జైలు శిక్ష విధించొచ్చు. మతం మారిన వారు తమ తల్లిదండ్రుల కులం, మతంకు సంబంధించిన ప్రభుత్వ ప్రయోజనాలు పొందలేరు. ఈ మేరకు వారు ముందుగా డిక్లరేషన్ ఇవ్వాలి. సంబంధించిన బిల్లును అసెంబ్లీ మూజు వాణి ఓటుతో ఆమోదించింది.
Comments
Please login to add a commentAdd a comment